అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కీలక నిర్ణయం..!!

అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక అంశాలను వెల్లడించారు. జగన్ హయాంలో సెకీతో చేసుకున్న ఒప్పందాల పైన పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలనే డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. దీంతో, ఒప్పందాల పైన అధ్యయనం తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. కాగా, ఈ రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. సెకీతో ఒప్పందం విషయంలో వెనక్కు వెళ్లలేమని తేల్చి చెప్పారు.

చంద్రబాబు క్లారిటీ
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్కరణల గురించి వివరించారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కమ్‌ లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామని గుర్తు చేసారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకుని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే ఎన్టీపీఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను 83 శాతం పీఎల్ఎఫ్‌తో నడిపించామన్నారు. చాలా ప్రైవేటు సంస్థలకూ అది సాధ్యం కాదని.. ఈ పరిపాలనా మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయమన్నారు.

రూ 9 వేల కోట్లు నష్టం
విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని గత ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకెళ్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పరిశ్రమలు కరెంటు వాడితే సర్చార్జి విధించిన పరిస్థితి గత ప్రభుత్వానిదన్నారు. ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం 23 శాతం మేర పెరిగిందన్నారు. సౌర, పవన విద్యుత్‌ను 7700 మెగావాట్లు మేర ఉత్పత్తి చేసిన మొదటి రాష్ట్రం ఏపీనే అని చెప్పుకొచ్చారు. అయితే 2019-24లో అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు. ఆలోచన లేకుండా వైసీపీ పీపీఏలను రద్దు చేసేసిందని గుర్తు చేసారు. పీపీఏల రద్దు విషయం అంతర్జాతీ య అంశంగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ఈగో కారణంగా రాష్ట్ర ఖజనా నుంచి రూ.9 వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

CM Chandra Babu reveals Power situation in AP and clarifies on Agreement with SEKI

సెకీతో ఒప్పందం పై
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం వల్ల అందులో జల విద్యుత్ కేంద్రం ఆగిపోయి 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాలేదన్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. టారిఫ్ అడ్జస్ట్‌మెంట్, ఫ్యూయల్ సర్చార్జ్ , ట్రూ ఆప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి రూ. 32,166 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం కూడా 4.6 శాతం మేర తగ్గిపోయిందని చెప్పారు. సెకీ ద్వారా చేసుకున్న పవర్ సప్లై అగ్రిమెంటు రాష్ట్రానికి భారంగా మార్చేశారన్నారు. ఒకసారి సంతకా లు చేసిన తర్వాత ప్రభుత్వంగా దాన్ని వెనక్కు తీసుకోలేమని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+