జగన్ పై మారుతున్న ఢిల్లీ లెక్కలు - బిగ్ టర్న్..!!

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఎన్నికలు జరిగిన ఏడాది కాలానికే కూటమి - వైసీపీ నేతలు మిషన్ 2029 ప్రారంభించారు. ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో సక్సెస్ అయిన ఫార్ములానే ఇప్పుడూ జగన్ పైన కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జగన్ కౌంటర్ స్కెచ్ అమలు చేస్తున్నారు. కూటమి ని ప్రజల్లోనే ఫిక్స్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు - పవన్ మాజీ సీఎం జగన్ పైన పంతం పట్టారు. మరి..ఢిల్లీ మూడ్ ఏంటి...

వ్యూహాత్మకంగా
2024 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు, పవన్ 2029 ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. పవన్ తాజాగా కూటమి పాలన ఏడాది సభలోనూ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. 15-20 ఏళ్ల వరకు కూటమి అధికారంలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక, సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పిన విధంగానే మరోసారి తాజాగా ఫిక్కీ సదస్సులో గత జగన్‌ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్లీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతు న్నారు. అలా జరగదు.. భయం వద్దు.. ఆ భూతం మళ్లీ రాదు. దానికి నాదీ హామీ.. నేను ఈసారి ఏమరుపాటుగా లేను. ఈ ప్రభుత్వమే కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను.. అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

మిషన్ 2029
చంద్రబాబు - పవన్ ఇద్దరూ కూటమిగా కొనసాగి తిరిగి 2029 లో అధికారంలోకి రావాలనేది వారి లక్ష్యం. అయితే, జగన్ మాత్రం ఏడాది కాలంలోనే కూటమి పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. కూటమి హామీల విస్మరణ పైన తమ పార్టీ నేతలను ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ ఫిక్స్ చేసారు. ఇటు పలువురు కూటమి ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. పవన్ ఎన్నికల సమయంలో చూపించిన దూకుడు.. సమస్యల ప్రస్తావన చేయకపోవటం పైన చర్చ జరుగుతోంది. అయితే, జగన్ పైన చంద్రబాబు, పవన్ చూపించిన దూకుడు అటు బీజేపీ నుంచి మాత్రం కనిపించటం లేదు. జగన్ పైన నిత్యం టార్గెట్ చేస్తే కొనసాగుతున్న ప్రచారం పైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

cm-chandra-babu-comments-in-ficci-meeting-becomes-big-political-debate

జగన్ నిలబడేనా
జగన్ తనకు.. తన పార్టీకి పోరాటాలు కొత్త కావని చెబుతున్నారు. అయితే, జగన్ 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ప్రచారం తిప్పి కొట్టటంలో విఫలమయ్యారు. ఇప్పుడూ కూటమి నేతలు జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. జగన్ కారణంగా రాష్ట్రం నష్టపోయిందని చెబుతూ.. తిరిగి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రానికి కష్టాలు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా చర్చ పైన జగన్ నామ మాత్రంగానే స్పందించారు. జగన్ అమలు చేసిన పథకాలనే కూటమి అమలు చేయటం ద్వారా వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్ పైన ఫోకస్ చేసింది. జగన్ 40 శాతం ఓటింగ్ ఎంత మేర కూటమి వైపు టర్న్ అవుతుందనేది కీలకం. జగన్ జనంలోకి వెళ్లటం ద్వారా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో, 2029 లక్ష్యంగా చంద్రబాబు - పవన్ పంతం, అటు బీజేపీ అడుగులు.. ఇటు జగన్ ఎలా ఎదుర్కొంటారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+