అమరావతికి ప్రధాని మోదీ - కీలక మలుపు..!!
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతి కి ఆర్ది కంగా తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరు కాగా, కేంద్రం రూ 1500 గ్రాంట్ గా ఆమోదించింది. అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రాజధానికి ప్రధాని
2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. ఆ తరువాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకు రావటంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్దిక వనరుల సమీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకు - ఏడీబీ నుంచి రూ 13 వేల కోట్ల మేర రుణం అమరావతికి మంజూరు అయింది. అదే విధంగా ఇతర ఆర్దిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు.

అమరావతి వేదికగా
ఇదే సమయంలో అమరావతి పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పనులు తిరిగి ప్రారంభ వేడుకను గణంగా నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. ఏప్రిల్ లో ఈ మేరకు వేడుకలా నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా.. అంగీకరించినట్లు సమాచారం. తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి లో రూ రూ.64,721 కోట్ల ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ 2028కి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విధంగా భూ కేటాయింపుల పైన ప్రభు ప్రత్యేకంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది.
ప్రధాని రాకతో
అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో రూ 11 వేల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూ. 37,702 కోట్ల పనులకు సంబంధించి 59 టెండర్లను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తున్నారు. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఇక, ప్రధాని రావటం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన ముహూర్తం ఒకటి, రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications