చంద్రబాబుకు 'ఢిల్లీ' పరీక్ష- ఏం జరుగుతోంది..!!

Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ సమరానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకున్నా..బీజేపీ, ఆప్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల యుద్దం జరుగుతోంది. మూడు పార్టీలు పోటీ పడి ఎన్నికల హామీలు గుప్పించాయి. బీజేపీ తమ మిత్రపక్ష పార్టీలను ప్రచారంలోకి దించుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 2న ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు. తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసారు.

ఢిల్లీకి ఏపీ సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) రాత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన ఢిల్లీలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసారు. ఏపీ - తెలంగాణ కు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఢిల్లీ పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీకి ఈ సారి ప్రతీ నియోజకవర్గంలో గెలుపు కీలకంగా మారుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో బీజేపీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ.. మోదీ నాయకత్వానికి మద్దతు గా ఓట్లు వేయాలని కోరనున్నారు.

CM Chandra Babu is set to campaign in the Delhi Election on behalf of BJP Candidates

చంద్రబాబు ప్రచారం
2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎన్డీఏలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు, పవన్ పాల్గొనేలా తొలుత షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే, అదే సమయంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంతో ప్రచారం చేయకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. పవన్ మహారాష్ట్రలో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసారు. పవన్ చేసిన నియోజకవర్గాలతో సహా.. బీజేపీ కూటమి మహారాష్ట్రలో ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రచారం చేస్తున్న నియోజకవర్గాల్లో స్పందన.. ఆ తరువాత ఎన్నికల ఫలితం పైన ఆసక్తి నెలకొంది.

హోరా హోరీ
కాగా, పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు షెడ్యూల్ మాత్రం ప్రకటించలేదు. ఫిబ్రవరి 3వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో, అసలు పవన్ పాల్గొంటున్నారా లేదా అనేది అధికారికంగా స్పష్టం కావాల్సి ఉంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారం పతాక స్థాయికి చేరింది. మూడు పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నా.. గ్రౌండ్ రిపోర్ట్స్ లో మాత్రం బీజేపీ - ఆప్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకుందని చెబుతున్నారు. దీంతో, ప్రచారంలో చివరి మూడు రోజుల ఢిల్లీలో చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+