వర్మకు కీలక పదవి - కూటమి ఎమ్మెల్సీలు ఖరారు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవ్వటం ఖాయమని భావిస్తున్న వేళ భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి అయిదుగురు ఎమ్మెల్సీల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చింది. నాగబాబుకు మంత్రి పదవి లేనట్లుగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు పదవి పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమిలో పదవుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

వర్మకు పదవి ఖాయం..!
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. కూటమికే అయిదు స్థానాలు దక్కనున్నాయి. ఈ అయిదు స్థానాల్లో ఇప్పటి వరకు జనసేన నుంచి నాగబాబుకు ఖాయమని అందరూ భావించారు. అనూహ్యంగా నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు వేళ చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు నాగబాబు కు ఇక ఆ అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో, నాగబాబుకు అసలు ఏ పదవి దక్కుతుందనేది సస్పెన్స్ పెంచుతోంది. ఇక, అయిదు స్థానాలకు ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

CM Chandra Babu likely to nominate pithapuram Varma as MLC as Assurance in Elections

చంద్రబాబు కసరత్తు
కూటమికి దక్కే అయిదు స్థానాల్లో జనసేన - బీజేపీ ఒక్కో స్థానం కోరుతున్నాయి. చంద్రబాబుతో పవన్ ఇదే అంశం పైన చర్చించారు. నాగబాబు రేసు నుంచి తప్పుకోవటంతో జనసేనకు ఛాన్స్ లేదని చెబుతున్నారు. బీజేపీకి ఒక సీటు దక్కనుంది. టీడీపీకి దక్కే నాలుగు స్థానాల్లో పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు ఖాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సీట్ల విషయంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలకు మూడు స్థానాలు దక్కుతాయని తెలుస్తోంది. దీంతో.. మైనార్టీ కోటాలో కేఎం సైఫుల్లా, మహ్మద్ నజీర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

తుది జాబితాలో
ఇక, బీసీ కోటాలో బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ప్రస్తుతం రిటైరవుతున్న ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబు ఉన్నారు. దేవినేని ఉమాకు అవకాశం పైన చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసారు. చంద్రబాబు హామీ మేరకు ఇప్పుడు ఆయనకు పదవి ఖాయమని భావిస్తున్నారు. దీంతో.. చివరికి ఈ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయనేది కూటమిలో ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+