విజయవాడ బీసెంట్ రోడ్‌లో సీఎం చంద్రబాబు.. దీపావళి షాపింగ్ !

భారతదేశ వ్యాప్తంగా దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా దీపావళి ఉత్సాహం కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాలు వెలుగుల కాంతులతో మెరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే పండుగ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పండుగ ఉత్సాహం నడుమ ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అక్కడి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, షాపు యజమానులతో ముచ్చటించారు.

సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం

ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పలువురు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడుతూ.. ఆయన విక్రయించే ప్రమిదలు, జ్యూట్ బ్యాగుల వ్యాపారం గురించి అడిగారు. జీఎస్టీ తగ్గింపు తర్వాత విక్రయాలపై ఎంత ప్రభావం పడిందని వివరాలు తెలుసుకున్నారు.

cm-chandrababu-on-vacatin-of-diwali-festival-visited-vijayawada-besant-road

చెప్పుల షాపులు, బట్టల దుకాణాల్లో సందర్శన..

ఆ తర్వాత సీఎం చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపును సందర్శించి జీఎస్టీ తగ్గింపుతో చెప్పుల ధరలు ఎంత మేర తగ్గాయి? విక్రయాలు ఎలా ఉన్నాయి? అని అడిగారు. తరువాత ఒక బట్టల షాపునకు వెళ్లి అక్కడ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మీతో మాట్లాడారు. పండుగ సీజన్‌లో విక్రయాలు ఎలా సాగుతున్నాయి? అని ఆమెతో ముచ్చటించారు. అలానే ఒక కిరాణా షాపు వద్దకు వెళ్లి, నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్ తో సీఎం మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరల్లో జీఎస్టీ తగ్గింపుతో ఏవైనా మార్పులు వచ్చాయా? గత ఏడాదితో పోలిస్తే ధరల వ్యత్యాసం ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, నూనెల వంటి వస్తువుల ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు.

ఇక పర్యటనలో భాగంగా బీసెంట్ రోడ్‌లో షాపింగ్‌కి వచ్చిన పౌరులతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజలతో చేతులు కలిపి, వారితో సెల్ఫీలు దిగారు. పిల్లలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వేళ అనూహ్యంగా సీఎం అలా పర్యటించడం పటలం ఒకింత ఆశ్చర్యపోతూనే వ్యాపారులు, వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బీసెంట్ రోడ్ మొత్తం పండుగ వెలుగులతో మెరిసిపోయింది. దుకాణాలు రంగురంగుల లైట్లతో అలంకరించబడి, కొనుగోలుదారులు క్యూలుగా నిలబడి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. బట్టలు, మిఠాయిలు, పటాకుల విక్రయాలు పెరిగి, మార్కెట్ మొత్తం ఉత్సాహంగా కనిపించింది.

cm-chandrababu-on-vacatin-of-diwali-festival-visited-vijayawada-besant-road

మరోవైపు చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అని రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. లోకకంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఎంతో ప్రాశస్త్యం ఉందని గుర్తుచేశారు. "దీపం జ్యోతిః పరంబ్రహ్మ... దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే" అంటూ శ్లోకం పోస్ట్ చేశారు. ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+