గతంలో ఆంక్షలు ఉంటే.. ఈసారి చిరునవ్వులు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు !

విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల 'కార్యసిద్ధి మహాశక్తి గణపతి' విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం విశేషమని సీఎం చెప్పారు.

తెలుగు ప్రజల శ్రేయస్సే నా ఆకాంక్ష..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని గణనాథుడిని మనసారా కోరుకున్నాను అని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా, అభివృద్ధి నిరంతరంగా సాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. చిన్నతనం నుంచి తానే గణేష్ మహోత్సవాలు నిర్వహించేవాడినని గుర్తుచేసుకున్నారు. "విఘ్నాలను తొలగించే శక్తి వినాయకుడికే ఉంది. అందుకే దేశమంతా గణేష్ చతుర్ధిని భక్తి భవంతో జరుపుకుంటారు" అని తెలిపారు.

cm-chandrababu-visit-72-foot-karyasiddhi-mahashakti-ganapati-at-vijayawada

రాష్ట్ర అభివృద్ధి, జలవనరుల పరిరక్షణపై దృష్టి..

అలానే రాష్ట్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. బుడమేరు వరదలు మళ్లీ రాకుండా సమగ్ర చర్యలు చేపట్టాం. ఈ ఏడాది గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినా, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలా ఉన్నాయన్నారు. కరువు భయం లేకుండా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. గణేశ్ మండపాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా కల్పించామని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు పర్మిషన్ల కోసం ఇబ్బందులు ఎదురయ్యేవని.. ఈసారి మాత్రం ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాని స్పష్టం చేశారు. దానికి రూ.30 కోట్లు ఖర్చవుతున్నా, ప్రజల ఆనందం కోసం వెనుకాడలేదు" అని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడం తమ సంకల్పం అని.. ప్రజల సౌభాగ్యమే పాలన ధ్యేయమని అన్నారు.

గత ప్రభుత్వంపై మండిపడ్డ సీఎం..

ఈ సందర్బంగా చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు గణేశ్ ఉత్సవాలు సరిగా జరగనివ్వలేదని గుర్తు చేశారు. ప్రజలు ఆనందంగా పండుగ చేసుకోవడానికీ అడ్డంకులు సృష్టించారని.. వినాయకుడు అంటే తమాషా కాదని.. భక్తిని అపహాస్యం చేస్తే వడ్డీతో సహా వసూలు చేస్తాడని హెచ్చరించారు.

తమ ప్రభుత్వం మాత్రం భక్తి, సంప్రదాయాలకు అండగా నిలుస్తుందని.. అందుకే ఉత్సవాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతున్నాయని సీఎం వివరించారు. ఇది తమ ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అని చెప్పుకొచ్చారు. గణేశుడికి దొంగ దొంగతనంగా దణ్ణాలు పెడితే మీరు చేసిన పాపాలు మాఫీ కావన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+