ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పథకాలు ఆపేయాలంటున్నారు - ఒప్పుకుంటారా : బాబు చేయలేనిది..మనం ఆచరణలో : సీఎం జగన్ ఫైర్..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు..దత్తపుత్రుడు..మద్దతు మీడియా అంటూ మరోసారి మండిపడ్డారు. ఒంగోలులో సున్నీ వడ్డీ పథకం ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ 3,615 కోట్లు ఈ పథకం కింద విడుదల చేసినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న ఆదాయమే...చేసిన అప్పులే...ఇప్పుడు తన ప్రభుత్వంలోనూ ఉన్నాయన్నారు. గతం కంటే కొంత అప్పులు తక్కువే ఉన్నాయని వివరించారు. నాడు చంద్రబాబు చేయలేనిది..నేడు జగన్ ఎలా చేయగలుగుతున్నారనేది ఆలోచన చేయాలని సూచించారు.

పథకాలు అమలు చేస్తే శ్రీలంకలా

పథకాలు అమలు చేస్తే శ్రీలంకలా

పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ టీడీపీ..దత్తపుత్రుడు..మద్దతు మీడియా ప్రచారం చేస్తోందని సీఎం ఫైర్ అయ్యారు. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పుకొచ్చారు. పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని.. చంద్రబాబు లాగా హామీలు అమలు చేయకపోతే అమెరికా అవుతుందని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు దత్తపుత్రుడు తమ పాలన వద్దని చెబుతున్నారని ధ్వజమెత్తారు. నిత్యం పధకాలు..ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారని..ఇదంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఉండవు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఉండవు

చంద్రబాబుకు ఓటేస్తే ఈ పథకాలు ఆగిపోతాయని ఈ ప్రచారం ద్వారా చెప్పకనే చెబుతున్నారని ఆరోపించారు. పథకాలు నిలిపివేస్తే మీరు అంగీకరిస్తారా అంటూ వరసగా పథకాలను ప్రస్తావిస్తూ వాటిని రద్దు చేస్తే మీరు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. వారి నుంచి ఒప్పుకోమని సమాధానం రాబట్టారు. తాను రాక్షసులతో యుద్దం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కరోనా వచ్చినా.. ఆర్దిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నా..తనకు రాష్ట్రంలో ఆర్దిక నిర్వహణ ఉన్నా..తాను వెనుకడుగు వేయలేదన్నారు.

జగన్ ఏం చేస్తుందీ మీరే ఆలోచన చేయండి

జగన్ ఏం చేస్తుందీ మీరే ఆలోచన చేయండి

దుష్ఠచతుష్ఠయంగా ఏర్పడి తమకు రాష్ట్రంలో చంద్రబాబు పాలన కావాలని అంటోందని విమర్శించారు. పేదలకు..ఎస్సీ - ఎస్టీ - బీసీ -మైనార్టీ..అగ్ర వర్ణాల్లోని పేదలకు మంచి చేస్తుంటే వద్దని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళల ఖాతాల్లో లక్ష కోట్ల 36 వేల 694 కోట్లు జమ చేసినట్లు వివరించారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల్లోనే చూపిస్తోందని జగన్ వివరించారదు. సామాజిక న్యాయం కోసం క్రిష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లోనూ జనరల్ సీట్లు అయినా..బీసీలను ఛైర్మన్లుగా నియమించామని వివరించారు. రాజకీయంగా - ఆర్దికంగా అన్ని వర్గాలకు న్యాయం చేయటే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. జగన్ న్యాయం చేస్తున్నాడా లేదా అనేది ప్రతీ ఒక్కరు మనసాక్షిగా ఆలోచించాలని సీఎం సూచించారు.

English summary
CM Jagan Fire on Chandra Babu and supproting media, he says if vote for yellow party all schemes will be stropped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X