వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ‌ల్లోకి జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో మ‌రో ర‌త్నం : అన్న‌దాత సుఖీభ‌వ ర‌ద్దు: రైతు భ‌రోసా ఆరంభం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమ‌ల్లోకి జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల్లో మ‌రో ర‌త్నం.. రైతు భ‌రోసా ఆరంభం..! || Oneindia Telugu

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న న‌వ‌ర‌త్నాల్లో మరో హామీ..కీల‌క‌మైన రైతు భ‌రోసా ప‌ధ‌కం ఆరంభానికి నిర్ణ‌యించారు. గ‌త ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు అమ‌లు చేసిన అన్న‌తాద సుఖీభ‌వ‌ను ర‌ద్దు చేసారు. అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇస్తామని ముఖ్యంత్రి పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్ అయ్యారు.

రైతు భ‌రోసా ఆరంభం..
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌సాయ స‌మీక్ష నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో త‌న ఎన్నిక‌ల హామీ అమ‌లు దిశ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న న‌వ‌ర‌త్నాల్లో కీల‌క‌మైన రైతు భ‌రోసా ప‌ధ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో అక్టోబర్‌ 15 నుంచి 'రైతు భరోసా' కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులకు జగన్‌ తెలిపారు.

CM Jagan announced Rythu Bharosa implementation form october 15th. This was the one of the jagan Navaratnalu

ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

న‌కిలీ విత్త‌నాల పైన సీరియ‌స్..
స‌మీక్ష‌లో భాగంగా..నకిలీ విత్తనాల చలామణీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దన్నారు. దీనిపై నూతన విత్తన చట్టం తేవాలని వైఎస్‌ జగన్‌కు అధికారులు సూచించారు.

అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని వైఎస్‌ జగన్‌ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను, వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రం లో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

English summary
AP CM Jagan announced Rythu Bharosa implementation form october 15th. This was the one of the jagan Navaratnalu. He also ordered officers dissolve Annadata Sukhibhava.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X