మహిళలకు సీఎం జగన్ శుభవార్త - నిధుల జమ, ముహూర్తం ఫిక్స్..!!
సీఎం జగన్ అధికారం నిలబెట్టుకోవటం పై గురి పెట్టారు. తన ఓట్ బ్యాంక్ బలోపేం పైన కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా మహిళలు, రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం పైనే ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 7 న వైఎస్సార్ చేయూన నిధులను విడుదల చేయనున్నారు.
వైఎస్సార్ చేయూత: ముఖ్యమంత్రి జగన్ రేపు (గురువారం) అనకాపల్లి జిల్లాలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. జగన్ ఈ సారి పూర్తిగా సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిన మేనిఫెస్టోను ఇప్పటికే 99 శాతం అమలు చేసామని చెబుతున్నారు.

వైఎస్సార్ చేయూత ఈ పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
మహిళలకు వరాలు: చేయూత పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ సారి ఈ పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్దిదారులకు రాసిన లేఖను అందించనున్నారు. ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ మేనిఫెస్టో కసరత్తు ముమ్మరం చేసారు. ఈ నెల 10న అద్దంకిలో జరిగే సిద్దం సభలో ఎన్నికల వరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
రైతులు, మహిళలకు సంబంధించి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దీంతో, పాటుగా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి దశల వారీగా రూ 4వేలకు పెంపు పైన జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అమ్మఒడిలోనూ మరింత మందికి మేలు చేసేలా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.
సీఎం హామీలపై ఉత్కంఠ: మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించేలా హామలు ఉండనున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ పైన కసరత్తు జరుగుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రైతు రుణామాఫీ చేయటమా..రైతు భరోసా నిధులు పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.ప్పటికే 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణ మాఫీ అమలు చేసారు.
దీంతో, మొత్తంగా రైతులు - మహిళల ఓట్ బ్యాంక్ సుస్ధిరం చేసుకొనే దిశగా సీఎం జగన్ ఈ వారంలో నిర్ణయాలు - అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 10న అద్దంకి సిద్దం సభలో సీఎం జగన్ కొన్ని ఎన్నికల వరాలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, జగన్ హామీల పైన అన్నివర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications