ఎన్నికల వేళ మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా, రాజకీయంగా వరుస నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్దులను దాదాపు ఖరారు చేసిన జగన్..అవసరమైన చోట అభ్యర్దులను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ నుంచి ముఖ్యులను మోహరిస్తున్నారు. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ మరో కీలక బాధ్యతలను అప్పగించారు.
జగన్ కొత్త నిర్ణయాలు
ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్దులను దాదాపు ఫైనల్ చేసారు. కొన్ని ఎంపీ స్థానాల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 10న అద్దంకి సిద్దం సభ ద్వారా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయం తీసుకున్నారు. 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన జగన్..ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను ప్రకటించనున్నారు. రైతులు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి నాలుగు విడతల్లో రూ 4 వేలకు పెంచేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల పర్యవేక్షణకు సీనియర్లను రంగంలోకి దించుతున్నారు.

పెద్దిరెడ్డికి బాధ్యతలు
ఇప్పటికే బూత్ స్థాయి నుంచి 15 మందితో కమిటీలు ఏర్పాటు చేసారు. వారిని నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్ది సమన్వయం చేసుకుంటున్నారు. పార్లమెంట్ నియోకవర్గాల వారీగా ఎన్నికల నిర్వహణ.. పార్టీ పర్యవేక్షణకు సీనియర్లను బరిలోకి దించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచందరారెడ్డికి ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటుగా తిరుపతి పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తిరుపతి పర్యవేక్షించిన సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తుండటంతో ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించారు.
ఎన్నికల టాస్క్
మంత్రి పెద్దిరెడ్డి ఈ సారి కుప్పం నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం పైన గురి పెట్టారు. ఈ రెండు స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావటంతో చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుస్తామని..మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు మిధున్ రెడ్డి కీలకమైన గోదావరి జిల్లాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. దీంతో..ఇప్పుడు వైసీపీ మెజార్టీ సీట్లు సాధించటమే లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రాంతాల్లో బాధ్యతలను పెద్దిరెడ్డికి కేటాయించటంతో..అక్కడ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications