న్యాయమూర్తులపై ట్రోలింగా - సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!
సమాజం కోసం తన ప్రాణాలను బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని సీఎం జగన్ కొనియాడారు. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు ఓ బాధ్యత కూడా అని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగం ఓ సవాల్ అని.. ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశమన్నారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలో సచివాలయాల్లో నియమించామన్నారు.
అమరవీరులకు నివాళి : పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతని వివరించారు. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యతగా పేర్కొన్నారు.

నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశమన్నారు. డేటాథెప్ట్, సైబర్ హెరాస్ మెంట్ వరకూ అన్ని అంశాల్లో దర్యాప్తు చేసి శిక్షవేయాలన్నారు. దీనికి మన పోలీసులు ఎంతో అప్డేట్ కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సైబర్ ప్రపంచంలో నేరగాళ్లు చీకటి ప్రపంచంలో ఉండి సవాళ్లు విసురుతున్నారని.. వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
అప్రమత్తంగా ఉండాలి : విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని... సాంకేతికతకు తగ్గట్లు అప్‌డేట్ కావాలని సూచించారు. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయని అప్రమత్తం చేసారు. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలని సూచించారు. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలన్నారు.
దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదని సీఎం స్పష్టం చేసారు. నేర నిరోధం, నేర దర్యాప్తులో ఏపీ పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే ముందున్నారని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలో సచివాలయాల్లో నియమించామన్నారు. దిశాయాప్, పోలీస్ స్టేషన్‌లు, పీపీలను నియమించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

న్యాయమూర్తులపై ట్రోలింగా : నూజివీడులో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను హత్యచేయడం.. అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్షనేత తన కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించడం.. పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యేలా చివరకు ఓ పోలసుకు కన్నుపోయేలా చేశారు అంటూ మండిపడ్డారు. అవినీతి చేసి, నేరాలు చేసి ఆపైన ఆదారాలు చూశాక వీరికి అనుకూలంగా న్యాయస్థానాల్లో తీర్పు రాకపోయే సరికి ఆ న్యాయమూర్తులను ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు.
ఇవి అసాఘిక శక్తులు చేసే పనులే అని.. ప్రజాస్వమ్యంపై నమ్మకం ఉన్న వారు చేసే పనికాదన్నారు. ఇలాంటి దుర్మార్గులపై చట్టం పనిపెట్టాలన్నారు. ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications