మంత్రి పదవా - రాజ్యసభకా : గౌతమ్ స్థానంలో ఎవరికి ఛాన్స్ - రేపు నెల్లూరులో సీఎం జగన్..!!
అధికార వైపీపీలో ఇప్పుడు మంత్రి పదవులు - పార్టీ బాధ్యతల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో..2024 ఎన్నికల పైన సీఎం జగన్ ఫోకస్ చేసారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు.. కేబినెట్ సహచరుడు అయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానం ఇప్పుడు మంత్రివర్గంలో భర్తీ చేసెదెవరు. ఆయన కుటుంబానికి పార్టీలో - ప్రభుత్వంలో దక్కే ప్రాధాన్యత ఏంటి. ఇప్పుడు ఇదే అంశం పార్టీలో చర్చకు కారణమవుతోంది.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు. మంత్రి మరణించిన సమయంలోనూ.. అదే విధంగా అంత్యక్రియలకూ సీఎం హాజరయ్యారు.

సంగం బ్యారేజీకి గౌతమ్ పేరు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సభలో గౌతమ్ కు సంతాపం ప్రకటించారు. సభకు ఒక రోజు సెలవు ప్రకటించారు. ఇక, సంతాపం ప్రకటించే సమయంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన విధంగా గౌతమ్ సంస్మరణార్దం మేకపాటి ఇంజనీరింగ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇక, ఇప్పటికే గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ సీటు గౌతమ్ మరణంతో ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫఫై చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. మరో అయిదు నెలల్లో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఉప ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

రాజకీయంగా స్థానం కల్పించటం పై..
అయితే, మంత్రిగా కొనసాగుతూ గౌతమ్ మరణించటంతో..ఆయన స్థానంలో ఇప్పుడు మేకపాటి కుటుంబ సభ్యుల్లో మంత్రి పదవి ఇస్తారా ..ఆ దిశగా సీఎం ఆలోచన చేస్తున్నారా అనే చర్చ పార్టీలో మొదలైంది. గౌతమ్ సతీమణి రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందుకొస్తే...గౌతమ్ స్థానంలో ఆయన సతీమణికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది.
ఇదే సమయంలో అదే కుటుంబం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించటం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ పొలిటిషీయన్. ఆయన పలు మార్లు ఎంపీగా పోటీ చేసారు. దీంతో.. ఆయనకు రాజ్యసభకు పంపిచేందుకు సీఎం జగన్ సిద్దమైనా..ఆయన ఆరోగ్య- వయసు కారణంగా ఆయన సిద్దపడకపోవచ్చని నెల్లూరు జిల్లా నేతలు చెబుతున్నారు.

మంత్రి పదవి ఎవరికి
దీంతో.. గౌతమ్ సతీమణి లేదా మేకపాటి రాజమోహన్ రెడ్డికి త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రిగా తీసుకొనే అవకాశాలు లేకపోలేదంటూ పార్టీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, మేకపాటి కుటుంబం ఇప్పటికీ గౌతమ్ మరణం విషాదం నుంచి కోలుకోలేదు. దీంతో..వారితో రాజకీయ అంశాల పైన చర్చకు అవకాశం లభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పుడు సీఎం గౌతమ్ సంస్మరణ సభకు హాజరవుతున్న వేళ..ఈ అంశం ప్రస్తావన - క్లారిటీ వచ్చ అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఈ అంశం పైన మేకపాటి రాజమోహన్ రెడ్డితో చర్చించిన తరువాతనే.. నెల్లూరు జిల్లాలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరికి అవకాశం ఇవ్వాలనే సమీకరణాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెల్లూరు పర్యటనలో ఫైనల్
మేకపాటి చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, గౌతమ్ సతీమణి కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేది వైసీపీ ముఖ్యనేతల ఆలోచన గా తెలుస్తోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగనుండటంతో ఈ అంశం పైన రేపటి (సోమవారం) సీఎం జగన్ నెల్లూరు పర్యటన లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డితో చర్చించి.. సీఎం తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications