టీడీపీ మూలాలే లక్ష్యంగా : వైఎస్సార్ ప్లస్ ఎన్టీఆర్ - కొత్త వ్యూహం : నాని-వంశీలకు బాధ్యతలు..!!

ఏపీలో టార్గెట్ 2024 లక్ష్యంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించే ఏపీలో ప్రతీ వర్గం ఇప్పుడు టీడీపీ..వైసీపీలకు కీలకం. దీంతో...2019 లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాల మద్దతు సాధించారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి తాము బలపడటంతో పాటుగా ప్రధాన ప్రత్యర్ధి చంద్రబాబును బలహీనపర్చే వ్యూహాలను అమలు చేస్తోంది. తాజాగా,జగన్ నాడు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ పార్లమెంటరీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేసారు. దీని పైన ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మాత్రం ఆచితూచి స్పందించింది. వైసీపీ ఇప్పుడు అమలు చేస్తున్న తాజా వ్యూహం పైన అటు వైసీపీ..ఇటు టీడీపీలో ప్రధానంగా చర్చ సాగుతోంది.

 ఎన్టీఆర్ పేరుతో మొదలు పెట్టి..

ఎన్టీఆర్ పేరుతో మొదలు పెట్టి..

ఎక్కడా వ్యతిరేకించకుండా..ఈ నిర్ణయం వరకూ స్వాగతిస్తూ...అన్న క్యాంటీన్ల రద్దును ప్రస్తావిస్తోంది. ఇప్పుడు ఏకంగా టీడీపీ మూలాలనే దెబ్బ తీసే లక్ష్యంతో సీఎం జగన్ అండ్ కో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఈ బాధ్యతలను మంత్రి నాని ..వంశీలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో ఎన్టీఆర్ పేరు పెట్టటం ద్వారా టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక, అనూహ్యంగా వైసీపీ నేతలే ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి..ఈ నిర్ణయాన్ని మరింత సానుకూలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. కరణం బలారం వంటి వారిని తమ వైపు తిప్పుకొంది. ఎన్టీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు నడిపిన కొడాలి నాని.. వల్లభనేని వంశీ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను సైతం వైసీపీ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ పేరుతో అభిమానులకు దగ్గరగా..

ఎన్టీఆర్ పేరుతో అభిమానులకు దగ్గరగా..

అందులో భాగంగానే... చంద్రబాబును విమర్శించే ప్రతీ సందర్భంలో కొడాలి నాని నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంశం... ఎన్టీఆర్ నాడు చంద్రబాబు గురించి చెప్పిన అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇక, తాజాగా గుడివాడ వివాదంలోనూ ఇది తనకు - చంద్రబాబుకు, ఒకే సామాజిక వర్గానికి చెందిన తమ మధ్య గొడవగా చెప్పే ప్రయత్నం చేసారు. చంద్రబాబు ఇతర వర్గాలను ఇందులో పావులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పటికే లక్ష్మీ పార్వతి వైసీపీలోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు - లోకేష్ ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలో యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఇవ్వరని వైసీపీ నేతల అంచనా. ఇక, టీడీపీకి మద్దతిచ్చే బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది.

చంద్రబాబును బలహీన పర్చేలా

చంద్రబాబును బలహీన పర్చేలా

దీని ద్వారా తాము ఆ వర్గానికి వ్యతిరేకం కాదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు, గుంటూరుకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు రాజ్యసభ ఇవ్వాలని భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ బలంగా నమ్ముకున్న వర్గ ఓటింగ్ ఉన్న క్రిష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో ఎంచుకున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వ్యూహాల ద్వారా..ఇప్పటి వరకు వైఎస్సార్ పేరు మాత్రమే ప్రస్తావన చేసే వైసీపీ నేతలు తాజాగా ఎన్టీఆర్ పేరు ను గుర్తు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని తాము అవకాశం వచ్చిన సందర్భంలో ఎన్టీఆర్ తో పాటుగా వైఎస్సార్ కు భారత రత్న ఇవ్వాలని కోరుతామని చెప్పుకొచ్చారు.

ఆ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు..

ఆ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు..

ఇలా..ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబుకు దూరం చేయటం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఆయన అభిమానులు వైసీపీకి మద్దతుగా నిలుస్తారా అనే ప్రశ్న మొదలైంది. దీంతో..కేవలం పేరుకే పరిమితం చేయకండా...వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పేరుకు ప్రాధాన్యత ద్వారా..పార్టీకి మద్దతుగా ఉన్న ఇతర వర్గాలకు దూరం కాకూండానూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందనే విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, టీడీపీలో ఎన్టీఆర్ అభిమానులు - చంద్రబాబు మద్దతు దారులుగా విడివిడిగా చూస్తున్న వైసీపీ .. ఇప్పుడు అమలు చేస్తున్న వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+