పంతం నెగ్గించుకున్న బాలినేని - ఒంగోలుకు సీఎం జగన్..!!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. అనంతపురం సిద్దం సభ ద్వారా ఇక పూర్తిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఓట్ మరింత సుస్థిరం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 25న ఒంగోలులో సీఎం పర్యటన ఖరారైంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఏకంగా 25 వేల కుటుంబాలకు మేలు చేసే నిర్ణయం అమలు చేస్తున్నారు.

బాలినేని నిర్ణయం : వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ బాలినేని వ్యవహారం ఉత్కంఠతకు కారణమైంది. ఒంగోలు ఎంపీగా మాగుంటను కొనసాగించాలని బాలినేని పట్టు బట్టారు. దీని కోసం ఒక విధంగా పోరాటం చేసారు. ఒంగోలు సమన్వయకర్తగా చెవిరెడ్డి నియామకం పైన తొలుత అసహనం వ్యక్తం చేసారు. అదే సమయంలో ఒంగోలులో 25 వేల పేదలకు ఇంటి స్థలాలకు వీలుగా నిధులు కేటాయిస్తేనే తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని షరతు విధించారు. దీంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చే సేందుకు అవసరమైన భూ సేకరణకు, లే అవుట్‌లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.231కోట్లు మం జూరు చేసింది.

CM Jagan To Distribue House sites for poor at Ongole on 25th fo this month

ఒంగోలుకు సీఎం జగన్ : దీంతో, బాలినేని తన నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల వేళ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందు కోసం ఈ నెల 20వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. సీఎం జగన్ ఈ ఇంటి పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.అగ్రహారం, మల్లేశ్వరపు రం, వెంగముక్కలపాలెం, యరజర్లలో 540 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 460 ఎకరాలు భూసేకరణ చేసారు. 22వేల మందికి పట్టాలు పంపిణీతో పాటు 15వేల మంది కి హౌసింగ్‌ మంజూరు పత్రాలను కూడా సీఎం చేతుల మీదుగా అందించేలా కార్యక్రమం షెడ్యూల్ చేసారు.

CM Jagan To Distribue House sites for poor at Ongole on 25th fo this month

పేదలకు ఇంటి స్థలాలు : ఈ సారి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పలు మార్పులు చేసారు. పలువురి సిట్టింగ్ లను మార్పు చేసారు. కొందరికి సీట్లు నిరాకరించారు. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈ సారి రెండు పార్టీలు జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇదే జిల్లాలో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సభ ఇంకొల్లులో జరుగుతోంది. 20న సీఎం జగన్ సభను బాలినేని తన వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ లోగానే ఒంగోలు ఎంపీతో పాటుగా జిల్లాలో మార్పుల పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+