ఈ నెల 29న తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ నిధుల జమ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తనకు అధికారం అప్పగిస్తాయనే ధీమాతో ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నారు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్ తాను ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29న విద్యా దీవెన నిధుల విడుదల చేయనున్నారు. ఇందుకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.
విద్యా దీవెన నిధులు:ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 29న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామం, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన ఖరారైంది. అక్కడ జరిగే సభలో సీఎం జగన్ విద్యా దీవెన నిధుల విడుదలతో పాటుగా బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సారి విద్యా దీవెన నిధుల విడుదల కోసం ఏపీ ప్రభుత్వం విద్యార్ధి తో పాటుగా తల్లి జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేయాలని తొలుత సూచించింది. అయితే, ఆ తరువాత వచ్చే విడత నిధుల సమయంలోనూ పూర్తి చేయాలని సూచించింది. ఇక..ఇప్పుడు విద్యా రంగానికి సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పిల్లల చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.

విద్యారంగానికి ప్రాధాన్యాత:అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ తో ఒప్పందం లాంటివి అమలు చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది.
ప్రజల్లోకి సీఎం జగన్:మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జగన్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 29న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు పాణ్యంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, డిసెంబర్ లో విశాఖ నుంచి పాలన ప్రారంభించటంతో పాటుగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ క్యాలెండర్ ప్రకటించారు. ఎన్నికల వేళ మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications