ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక టూర్..!!
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అటు పార్టీ అభ్యర్దుల ఖరారు కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల ద్వారా నేతలు..కేడర్ ప్రజల మధ్యనే ఉండేలా నిర్దేశించారు. మార్చిలోనే ఎన్నికలు ఉంటాయని చెప్పిన సీఎం జగన్...ఇప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజులు రెండు జిల్లాల్లో పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
సీఎం జగన్ జిల్లాల పర్యటన : ముఖ్యమంత్రి జగన్ డిసెంబర్ లో విశాఖ నుంచి పాలనకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. వారంలో రెండు రోజులు విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, జనవరి నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి ధీటుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.

సీఎం జగన్ రేపటి నుంచి రెండు జిల్లాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు.
వరుస కార్యక్రమాల్లో సీఎం : అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఆ తర్వాత ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కళాశాలలు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు.

అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైయస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. 10వ తేదీ 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
వై ఏపీ నీడ్స్ జగన్ : రేపు (గురువారం) నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ప్రారంభిస్తోంది. తొలి రోజున అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా గ్రామ పెద్దలతోనూ సమావేశం అవుతారు. రాష్ట్రంలో ఈ 54 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం..రాష్ట్ర వ్యాప్తంగా కోటి 40 లక్షల కుటుంబాలకు జరిగిన లబ్దిని వివరించనున్నారు. అదే సమయంలో ఏపీకి జగన్ ఎందుకు అవసరమో పార్టీ నేతలు వివరించనున్నారు. వచ్చే నెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంక్షేమ పథకాల అమలు.. కీలక నిర్ణయాల దిశగా కార్యాచరణ సిద్దం చేసారు.












Click it and Unblock the Notifications