అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు - సంప్రదాయ వస్త్ర ధారణలో..!!
ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దేవలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ రోజు మూల నక్షత్రం కావటంతో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. మధ్నాహ్నాం సమయానికే లక్షకు మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. సీఎం జగన్ దర్శనం కోసం వచ్చిన సమయంలో సాధారణ భక్తుల దర్శనం కొద్ది సేపు నిలిపివేశారు.
దేవాలయంలో సీఎం జగన్ కు చిన రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పరివేష్ఠం చుట్టారు. సంప్రదాయ వస్త్రధారణలో సీఎం జగన్ తన తలపైన అమ్మవారికి సమర్పించే పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలతో అంతరాలయం చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు..అమ్మవారి చిత్ర పటంతో పాటు లడ్డూ ప్రసాదం అందజేసారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్ తో పాటుగా మాజీ మంత్రులు కొడాలి నాని .. వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎంతో పాటు ఉన్నారు.

ఇక, అమ్మవారు మూల నక్షత్రం నాడు సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వీఐపీ దర్శనాలను రద్దు చేసారు. సామాన్య భక్తులకు దర్శనం కోసం అందరూ సహకరించాలని అధికారులు కోరారు. దాదాపు అయిదు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసారు. రాత్రి సమయానికి దాదాపుగా మూడు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. #CMYSJagan pic.twitter.com/9uQhiQCU7M
— YSR Congress Party (@YSRCParty) October 2, 2022












Click it and Unblock the Notifications