విజయసాయి మోడీ కాళ్లకు మొక్కలేదా: సిఎం రమేష్ మండిపాటు
Recommended Video

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రగులుతున్నాయి. పార్టీలు పరస్పరం విమర్శలతో, ఆరోపణలతో ఎదురు పార్టీలపై నిందలు వేస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ కాళ్లకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మొక్కారా, లేదా అనేది కూడా వివాదంగానే మారుతోంది.
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ సిఎం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటులో మోడీ కాళ్లపై పడుతారని, బయట చంద్రబాబును విమర్శిస్తారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ప్రధాని మడీ కాళ్లపై పడలేదని విజయసాయి రెడ్డి గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని ఆయన సవాల్ చేశారు. విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని విరుచుకుపడ్డారు. అవిశ్వాసం అంట వైసిపి నాటకాలు ఆడుతోందన, వైసిపి బండారం బయటపడిందని అన్నారు.
పార్లమెంటు ఆవరణలో మోడీ కాళ్లకు విజయసాయి రెడ్డి మొక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను నమస్కారం మాత్రమే పెట్టానని, మోడీ కాళ్లకు మొక్కలేదని విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications