జీఎస్టీ ఎఫెక్ట్: గుర్తుందా.. విభజనపై చిద్దూని తూర్పారబట్టిన సీఎం రమేష్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బుధవారం నాడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పైన బుధవారం నాడు నిప్పులు చెరిగారు. జీఎస్టీ బిల్లులో రేటు పేర్కొనాలన్న డిమాండును సీఎం రమేష్ తప్పుబట్టారు.
జీఎస్టీ బిల్లు పైన రాజ్యసభలో ఈ రోజు చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడారు. విపత్తులు సంభవిస్తే నష్టం పూడ్చుకునే అవకాశముందన్నారు. అదే సమయంలో చిద్దూ పైన నిప్పులు చెరిగారు.

లోకసభ, రాజ్యసభలోను మంచి చర్చ జరగాలని చిదంబరం కోరుతున్నారని, ఉభయ సభలలో చర్చ ద్వారా బిల్లులు ఆమోదం పొందాలని ఆయన అంటున్నారని, కానీ విభజన సమయంలో చివరి రోజు లోకసభలో ఏం జరిగిందని, తలుపులన్నీ మూసివేసి, టీవీలో లైవ్‌ను ఆపేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్నారు.
అందుకు చిదంబరం పనిముట్టుగా ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు మనం చర్చిద్దామని చెప్పడం విడ్డూరమన్నారు. మా విషయంలో ఓ విధంగా, ఇప్పుడు మరోలా చిదంబరం వ్యవహారం ఉందని నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండగా, కొత్త పన్నుల విధానం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలన్నారు.












Click it and Unblock the Notifications