పవన్ కళ్యాన్ పాటలు..సీఎం రమేష్ స్టెప్పులు: రిత్విక్ నిశ్చితార్దంలో స్పెషల్ ఎట్రాక్షన్..! (video)
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్దం వైభవంగా నిర్వహించారు. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. అందులో భాగంగా..దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో వేదిక ఖరారు చేసారు. ఇందు కోసం సీఎం రమేష్ పార్లమెంట్ లోని ఎంపీలతో పాటుగా అతిరధ మహారధులను ఆహ్వానించారు. వివాహానికి ఏ మాత్రం తీసిపోకుండా నిశ్చితార్ధం నిర్వహించారు. ఆ సమయంలో సీఎం రమేష్ జోష్ గా కనిపించారు. పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు.

భారీగా హాజరైప ప్రముఖులు
సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటుగా ప్రధానంగా ఢిల్లీలో బీజేపీ నేతలను పేరు పేరునా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పార్టీలకు అతీతంగా అందరికి సీఎం రమేష్ నుండి ఆహ్వానాలు అందాయి. దీని మీద రాజకీయంగా చర్చ సాగినా..వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలతో ముడి పెట్టలేమని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ..టీడీపీ..తో పాటుగా వైసీపీ నేతలకు కొందరికి సీఎం రమేష్ నుండి ఆహ్వాలు అందాయి. ఇక, పారిశ్రామిక ప్రముఖులు సైతం ఈ నిశ్చితార్ధం వేడుకకు హాజరైనట్లు సమాచారం.
ప్రత్యేకంగా వివామాలు.. అదిరిపోయే ఏర్పాట్లు..
అతిధులు వేడుకకు హాజరయ్యేందుకు.. ఇందు కోసం వారు దుబాయ్ చేరుకోవటానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేసారు. దుబాయ్ లో వేడుక కోసం ఎంపిక చేసిన వెన్యూ సైతం అదే స్థాయిలో అలంకరించారు. దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో ఈ వేడుక జరిగింది. ఇప్పుడు సీఎం రమేష్ కు వియ్యంకుడు అవుతున్న రాజా తాళ్లూరి సైతం ప్రముఖ పారిశ్రామిక వేత్త. అమెరికా కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఎంపీలు పలువురు హాజరైనట్లుగా తెలుస్తున్నా..ఏపీకి చెందిన వారిలో ఎవరెవ్వరు హాజరయ్యారనే అంశం తెలుసుకోవటానికి టీడీపీ..బీజేపీ..వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి టీడీపీ అధినాయకత్వం దీని పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.

స్టెప్పులతో సీఎం రమేష్ జోష్ ...
తన కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకల్లో సీఎం రమేష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన అతిధుల సమక్షంలో వేడుకకు మరింత జోష్ పెంచేందుకు స్వయంగా స్టెప్పులు వేసారు. పవన్ కళ్యాన్ పాటలకు సీఎం రమేష్ స్టెప్పులతో ఇరగ దీసారు. దీంతో..ఇప్పుడు సీఎం రమేష్ డాన్సు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, బీజేపీకి చెందిన కొందరు నేతలకు ఆహ్వానాలు అందలేదనే ప్రచారం సాగుతోంది. అయితే, వారితో కడప జిల్లా బీజేపీ నేతలు సైతం ఉండటంతో..రాజకీయంగా చర్చ మొదలైంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications