అందుబాటులో ఉన్న మంత్రులతో జగన్ అత్యవసర భేటీ

YS Jagan: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తన పదవితో పాటు పార్టీకీ గుడ్‌బై చెప్పారాయన. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

మంగళగిరి ఇన్‌ఛార్జీగా గంజి చిరంజీవిని అపాయింట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పద్మాశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అనంతరం గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. మంగళగిరి ఇన్‌ఛార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

CM YS Jagan hold meeting with senior YSRCPs leaders and Ministers

ఈ క్రమంలో మంగళగిరి వైఎస్ఆర్సీపీ నాయకులు గంజి చిరంజీవి, దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు వారి మధ్య చర్చలు సాగాయి. మంగళగిరితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలపై జగన్ ఆరా తీశారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని గెలిపించాల్సిన బాధ్యతలను చిరంజీవికి అప్పగిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ, శాసనమండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇందులో పాల్గొన్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడానికి గల కారణాలను క్షున్నంగా వివరించాలని సూచించారు.

మున్ముందు మరిన్ని మార్పులు ఉంటాయనే సంకేతాలను పంపించారు వైఎస్ జగన్. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడం వల్ల ఇప్పటి నుంచే స్థానిక నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేయక తప్పదని, దీనికోసం పార్టీ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జీల నియామకం తప్పదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+