నేడే లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నిధుల జమ..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల్లోనూ తాను అమలు చేసిన సంక్షేమమే మరోసారి అధికారం నిలబెడుతుందని నమ్ముతున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పధకాల లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అర్హులైన 10,511 జంటలకు ఈ మేరకు లబ్ది కలగనుంది.

కళ్యాణమస్తు -షాదీ తోఫా:ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని ప్రకటించాపేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. వధూవరులిద్దరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లి నాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.348.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

CM YS Jagan to release YSR Kalyanamastu and Shadithofa funds today at Camp office

గతం కంటే పెంచుతూ:గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి రూ.68.68 కోట్లు ఎగ్గొట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచింది. ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.40,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000. కాగా, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సా­యం రూ.75,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం చేస్తోంది. ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ఈ ప్రభుత్వం రూ.1,00,000 అందిస్తోంది. బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.35,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.50,000 ఇస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సా­యం రూ.50,000 కాగా, ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.75,000గా ఉంది.

నేడు 10,511 జంటలకు లబ్ది:కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.75,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,20,000 సాయం అందిస్తోంది. మైనార్టీలు, దూదేకులు, నూర్‌ బాషాలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.50,000 కాగా, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000గా పెంచింది. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ.1,00,000 కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిని రూ.1,50,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు సీఎం జగన్ ఈ రోజు 10,511 జంటలకు రూ.81.64 కోట్ల నిధులు జమ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+