నంద్యాల ఉపఎన్నికను రద్దు చేయాలి: ఈసీకి కాంగ్రెస్ వినతి
నంద్యాల ఉపఎన్నికను రద్దుచేయాలని ఈసీకి కాంగ్రెస్ కోరింది.ఈ ఎన్నికల్లో టిడిపి, వైసీపీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపణ.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలను రద్దు చేయాలని మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్ ను కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం డబ్బు పంపిణీపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

టిడిపి, వైసీపీల అభ్యర్థులూ పోటాపోటీగా డబ్బులను పంచుతున్నారని, ఈసీ తరఫున చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. వినతిపత్రాన్ని పై అధికారులకు పంపుతానని ఈ సందర్భంగా హేమాన్ష్ హామీ ఇచ్చారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications