జగన్ పై కాంగ్రెస్ వార్ షురూ, పొత్తులు ఖరారు: షర్మిల "నో" - ప్లాన్ ఛేంజ్..!!

ఏపీ పైన కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ చేసింది. కర్ణాటక, తెలంగాణ తరువాత ఇప్పుడు వై నాట్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తోంది. ఏపీ సీఎం జగన్ పైన వార్ ప్రకటించింది. ఏపీలో పొత్తులను ఖరారు చేస్తోంది. ఇటు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న వేళ అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో, ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ నాయకత్వం ఢిల్లీలో సమావేశం అవుతోంది. పొత్తులతో పాటుగా ఎన్నికల రోడ్ మ్యాప్ ఖరారు చేయనుంది.

రోడ్ మ్యాప్ ఖరారు: ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ గా మాణిక్కమ్ ఠాగూర్ నియమితులయ్యారు. తాజాగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ ఆడుదాం ఆంధ్ర ప్రారంభించిన వేళ..ఏపీలో కొనసాగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసారు. జగన్ పైన విమర్శలు గుప్పించారు.

Congress High Command Focus On AP Elections, to finalise Alliances and Road map

ఇక, ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి, ఎంఎం పళ్లంరాజు, చింతా మోహన్‌ సహా 30 మంది నేతలతో బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం పైన రోడ్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు.

షర్మిలకు కొత్త బాధ్యతలు: ఇదే సమయంలో షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం దిశగా ప్రయత్నాలు చేసారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో నిర్ణయం అమలు కాలేదు. షర్మిల పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు. షర్మిలను తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పిలవలేదు.

ఇప్పుడు ఏపీలో షర్మిల కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. కానీ, షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణకు సముఖంగా లేరని విశ్వసనీయ సమాచారం. దీంతో షర్మిల వచ్చే వారం కాంగ్రెస్ లో అధికారికం గా చేరనున్నారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే పని చేయటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

ఏపీలో పొత్తులు - కొత్త లెక్కలు: ఏపీలోనూ షర్మిల పార్టీ కోసం ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతోనే ఏపీలోనూ పొత్తులు కొనసాగించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. సీపీఐతో ఇప్పటికే నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. సీపీఎం వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీ, జనసేన పొత్తు లో భాగంగా సీట్లు, మేనిఫెస్టో పైన కసరత్తు జరుగుతోది.

బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందనే పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇటు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ఈ పొత్తులు..సమీకరణాల నేపథ్యంలో తమ పార్టీ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకున్న సీఎం జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల వ్యూహాలు అమలు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+