కడప గడ్డపై తొలి సారి రాహుల్, రేవంత్ - టార్గెట్ జగన్, పెద్ద స్కెచ్..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 7,8 తేదీల్లో ప్రధాని మోదీ మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కడపలో ప్రచారానికి వస్తున్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తొలి సారి కడప గడ్డకు రాహుల్ , రేవంత్ వస్తుండటంతో ఆసక్తి నెలకొంది.
కడపకు రాహుల్
ఎన్నికల్లో కడప రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. జగన్ ను కార్నర్ చేస్తూ షర్మిల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి అవినాశ్ పైన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తన సోదరికి డిపాజిట్లు రావనే బాధ ఉందన్నారు. వివేకా హత్య కేసు విషయంలో అవినాశ్ పైన ప్రచారం చేస్తున్న షర్మిల..మద్దతుగా నిలుస్తున్నారంటూ జగన పైన ఆరోపణలు చేస్తున్నారు. అటు జగన్ నేరుగా షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, రేవంత్ చెప్పినట్లుగా షర్మిల నడుచుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

షర్మిలకు మద్దతుగా
ఈ సమయంలో కడపలో షర్మిల కు మద్దతుగా కడపలో ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వస్తున్నారు. ఈ నెల 7న రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కడపకు వస్తున్నారు. కడప లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఏపీలో జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో జగన్ సోదరికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారుతోంది. బీజేపీతో జత కట్టిన చంద్రబాబు పైన రాహుల్ స్పందించే అవకాశం ఉంది. వివేకా హత్య గురించి రాహుల్, రేవంత్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ తొలి సారి కడపకు వస్తున్నారు.
టార్గెట్ జగన్ రాజకీయం
వైఎస్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చటం..జగన్ పై కేసులతో కడప జిల్లా పైన నాటి నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. వైఎస్ పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చటం పైన వైసీపీ నేతలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో, ఈ అంశం పైన కడప వేదికగా రాహుల్ స్పందిస్తారనే అంచనా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అదే విధంగా రేవంత్, డీకే శికుమార్ ప్రచారం పైన ఆసక్తి నెలకొంది. వైసీపీ, ఎన్డీఏ కూటమి లక్ష్యంగా ఈ నేతల ప్రచారం కొనసాగనుంది. దీంతో..రాహుల్ కడపలో ప్రస్తావించే అంశాలు...ప్రచారం పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications