ఏపీ పెరిగిన కరోనా మరణాలు.. కొత్తగా 10,310 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత మూడూ రోజులుగా క్రమేనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతూ వస్తుంది. అయితే మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 39,296 శాంపిల్స్ పరీక్షించగా .. 10,310 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. తాజాగా మహమ్మారితో పోరాడుతూ 12 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14,606కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో లక్షకుపైగా పాజిటివ్ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,24,45,428 మందికి పరీక్షించారు. వారిలో 22,70,491 మందికి కరోనా నిర్థారణ అయింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,39854 పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,310 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

కడపలో కరోనా విలయం
ఏపీలో అత్యధికంగా కడప జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కడప జిల్లాలో 1697 మందికి పాజిటివ్‌గా తేలింది. తర్వాత కర్నూలు 1379, గుంటూరు 1249, కృష్ణా 1008, నెల్లూరు 927, తూర్పుగోదావరి 943, విశాఖపట్నం 853, ప్రకాశం 700 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి 626, చిత్తూరు 411, శ్రీకాకుళం 229, విజయనగరం 222 , అనంతపురం అత్యల్పంగా 99 కేసులు వచ్చాయి.

దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు
అటు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మూడు లక్షలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు ఇప్పుడు రెండు లక్షలకు దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉందని తెలిపింది.. అయితే, అదే సమయంలో మరణాల సంఖ్య పెరగటం కొంత ఆందోళనకు కారణమవుతోంది. వైరస్‌తో మరో 893 మంది మరణించారు. 3,52,784 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

వేగవంతంగా వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఇప్పటి వరకు 75 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522కి చేరింది. మొత్తం మరణాలు 4,94,091కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,87,13,494 మంది కరోనా నుంచి కోలుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.












Click it and Unblock the Notifications