జగన్ కోల్‌కతా టూర్‌కు గ్రీన్ సిగ్నల్: రేపు దీదీతో భేటీ
హైదరాబాద్: కోల్‌కతా, లక్నోలకు వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కోర్టు అనుమతించడంతో జగన్ బుధవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, గురువారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలువనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వారి మద్దతును జగన్ కోరనున్నారు.
కాగా, కోల్‌కతా, లక్నోలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైయస్ జగన్ సోమవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. సిబిఐ ఈ రోజు అభ్యంతరం లేదని చెప్పడంతో కోర్టు అనుమతించింది.

బుధవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, గురువారం అఖిలేష్ యాదవ్‌ను తాను కలవాల్సి ఉందని చెబుతూ అందుకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.
మరోవైపు వైయస్ జగన్‌కు సిబిఐ కోర్టులో సోమవారం ఉదయం ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న తర్వాత జగన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.












Click it and Unblock the Notifications