భారత్ వైఖరిని తేల్చి చెప్పిన అజిత్ దోవల్

బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల 16వ ఉన్నత స్థాయి సమావేశం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. ఢిల్లీ దీనికి వేదిక. భారత ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇందులో పాల్గొన్నారు. అంతర్జాతీయ భద్రతా సవాళ్లపై కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను నివారించేందుకు నిర్దేశించిన అంతర్జాతీయ వ్యవస్థలు బలహీనపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సున్నిత సమయంలో ప్రపంచ శాంతి, భద్రతలను కాపాడటంలో బ్రిక్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ గ్రూపులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సమకాలీన ప్రపంచం ఎదుర్కొంటున్న వేగవంతమైన మార్పులు, అనిశ్చిత వాతావరణాన్ని అజిత్ దోవల్ విశ్లేషించారు. విభిన్న ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వైవిధ్యభరితమైన అనుభవాలను కలిగి ఉన్న దేశాల కలయిక అయిన బ్రిక్స్.. ఈ సంక్షోభ సమయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.

NSA Ajit Doval Welcomes US-Iran MOU Says BRICS Must Help Blunt Conflict-Resolution Challenges Voice

అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన చారిత్రక అవగాహన ఒప్పందాన్ని తాము స్వాగతిస్తోన్నామని అజిత్ దోవల్ తెలిపారు. ఈ పరిణామం వల్ల ఇంధన భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని, అంతర్జాతీయ విపణిలో ముడి చమురు సరఫరాకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా తిరిగి నౌకల ప్రయాణాలు ప్రారంభం కావడం గొప్ప పరిణామమని దోవల్ ప్రశంసించారు.

దీనివల్ల కొంతకాలంగా అంతర్జాతీయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సప్లై చైన్ అడ్డంకులు, రవాణా సమస్యలు చాలా వరకు తొలగిపోతాయని వివరించారు. హార్ముజ్ మార్గం గుండా స్వేచ్ఛా నౌకాయానం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య లావాదేవీల వ్యయం తగ్గుతుందని, ఇది వినియోగదారులకు లాభం చేకూరుస్తుందని తెలిపారు. ఉమ్మడి శాంతి, స్థిరత్వం ఆధారంగానే ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితి గరిష్ట స్థాయిలో మెరుగవుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

రాబోయే సవాళ్లను ధీటుగా ఎదుర్కొని భవిష్యత్ ఆధునిక ప్రపంచాన్ని నిర్మాణాత్మక పథంలో నడిపించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని దోవల్ పునరుద్ఘాటించారు. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా అవతరించిన బ్రిక్స్ కూటమి శాంతి, పరస్పర ప్రగతి, అంతర్జాతీయ పాలనా సంస్థలలో సమగ్ర సంస్కరణల దిశగా సమర్థవంతంగా అడుగులు వేయాలని అజిత్ దోవల్ ప్రతిపాదించారు. నానాటికీ విస్తరిస్తున్న ఉగ్రవాదం, సవాల్ విసురుతున్న సైబర్ దాడులు అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ఆధారిత సాధనాల విస్తృతి పెరుగుతుండటంతో సైబర్ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం అనివార్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమి పరిధిలోని ఉగ్రవాద నిరోధక జాయింట్ వర్కింగ్ గ్రూప్ లతో పాటు సమాచార మార్పిడి, ప్రసార సాంకేతిక భద్రతా బృందాలు రూపొందించే వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సరికొత్త రక్షణ వ్యవస్థల ఆధారంగా సభ్య దేశాలు పరస్పరం రక్షణ సమాచారాన్ని పంచుకుంటూ ముప్పేట ఎదురుదాడి చేయడానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+