CCPA: డార్క్ ప్యాటర్న్స్‌తో కస్టమర్లకు టోకరా? జెప్టో, బుక్‌మైషో సహా 9 యాప్స్ కు భారీ జరిమానాలు!

భారత్ లో ఆన్ లైన్ కొనుగోళ్లు, లావాదేవీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో మోసాల సంఖ్య కూడా అంతకన్నా ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా పలు ప్రముఖ యాప్ లు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమ వినియోగదారుల్ని రకరకాలుగా మోసాలు చేస్తున్నాయి. పైకి చూపించే రేటు ఒకటి, చివరికి వారికి చూపించే రేటు మరొకటి. తప్పనిసరి పరిస్ధితుల్లో కస్టమర్లు ఇలా షాపింగ్ చేస్తూ మోసపోతున్నారు. దీంతో వినియోగదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్న 9 యాప్స్ పై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్ధ (CCPA) కొరడా ఝళిపించింది.

డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!
డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!

ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు కొనుగోలు చేసేటప్పుడు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు, వినోద కార్యక్రమాల కోసం టికెట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న పలు సంస్థలపై సీసీపీఏ జరిమానాలు విధించింది. డార్క్ ప్యాటర్న్ (Dark Patterns)లుగా అభివర్ణించే ఈ మోసపూరిత విధానాల ద్వారా కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ జెప్టో, బుక్ మై షో, ఇండిగో, ఫిజిక్స్ వాలా వంటి 9 యాప్స్ పై ఇలా సీసీపీఏ 20 లక్షల జరిమానా విధించి వసూలు చేసింది. ఈ మేరకు కేంద్రం తాజాగా రాజ్యసభకు అధికారికంగా సమాచారం ఇచ్చింది.

CCPA Penalises 9 Digital Platforms for Using Dark Patterns to Manipulate Users
Viral Video:
Viral Video:

క్విక్ కామర్స్ విభాగంలో ఉన్న జెప్టో సంస్థ మొదట తక్కువ ధరలను చూపిస్తూ, చెల్లింపుల సమయంలో అదనంగా హ్యాండ్లింగ్ ఛార్జీలు, మెంబర్‌షిప్ ఫీజుల్ని జోడిస్తోంది. దీంతో డార్క్ ప్యాటర్న్స్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ ప్లాట్‌ఫారమ్‌కు రూ. 7 లక్షల జరిమానా విధించారు. దీంతో జెప్టో ఆ విధానం నిలిపేసింది. అలాగే ఆన్‌లైన్ విద్యా సంస్థ ఫిజిక్స్ వాలా ఉచిత కోర్సులను ప్రారంభించే ముందు వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సేకరించడం, విరాళాల పెట్టెలను ముందే ఆటో-సెలెక్ట్ చేసినందుకు రూ.5 లక్షల జరిమానా చెల్లించింది. సినిమా టికెట్ల బుకింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్‌మైషోలో కూడా ఇలాంటి మోసపూరిత విధానమే బయటపడింది. టికెట్ బుక్ చేసే సమయంలో సమాజ సేవకు సంబంధించిన విరాళం మొత్తాన్ని వినియోగదారుడే స్వయంగా తొలగించేలా ముందుగానే ఎంపిక చేసి ఉంచడాన్ని సీసీపీఏ తప్పుబట్టింది. ఇండిగో తన యాప్‌లో కస్టమర్లు కొన్ని సేవలను వదులుకున్నప్పుడు వారిని భయపెట్టే విధంగా ఉండే సంభాషణలను మార్చుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జాబితాలో ఫస్ట్‌క్రై, ఫార్మ్ ఈజీ, మెకాఫీ, స్పైస్‌జెట్ , అనుజ్ జిందాల్ కోచింగ్ సెంటర్ కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+