ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లకు ఏపీ మాజీ ఐపీఎస్ గుడ్ న్యూస్..! డబ్బులు మిగిలే యాప్..!

ఓలా(Ola), ఉబర్(Uber), ర్యాపిడో (Rapido)వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న కమిషన్ కష్టాలపై ఏపీలో తాజాగా రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి స్పందించారు. వారి కోసం ఏకంగా ఓ యాప్ తయారు చేసి అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. పోలీసు శాఖలో తన అనుభవంతో ఈ యాప్ తో పాటు ఓ కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తానని ఆయన వెల్లడించారు. వీటి ద్వారా సదరు గిగ్ వర్కర్ల కష్టాలు తీరుస్తానంటున్నారు.

మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!
మావిగన్ వేస్ట్- అమరావతిపై కోర్టుకు..! సాయిరెడ్డి మరో సంచలనం..!

తాజాగా విశాఖలో ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు సమ్మెకు సిద్దమయ్యారని, వారికి నెలలో వచ్చే రైడ్లతో సంబంధం లేకుండా వాళ్లు పనిచేస్తుున్న కంపెనీలు ముక్కుపిండి 18 వేలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వారు ఈ నిరసన చేపడుతున్నట్లు మాజీ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ (pv sunil kumar) తెలిపారు. రైడ్ లు రాకుండా ఇలా నెలకు 18 వేలు కట్టాలని చెప్పడం దారుణమని పేర్కొన్న సునీల్.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇలా వసూలు చేయడం సరికాదని తెలిపారు. కాబట్టి వారిని ఆదుకునేందుకు తానే స్వయంగా ఓ యాప్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

Ex-AP IPS PV Sunil Kumar set to Launch Free App for Cab and Bike Taxi driver- here is why
రఘురామ-పీవీ సునీల్ వివాదంలో బిగ్ ట్విస్ట్ లు..! ఏం జరగబోతోంది ?
రఘురామ-పీవీ సునీల్ వివాదంలో బిగ్ ట్విస్ట్ లు..! ఏం జరగబోతోంది ?

ఇందులో భాగంగా రైడ్ వస్తేనే కమిషన్ వచ్చే విధంగా ఈ యాప్ ను తాను ప్రారంభించబోతున్నట్లు పీవీ సునీల్ కుమార్ ప్రకటించారు. పోలీసు శాఖలో సైబర్ నేరాలు, ఇతర విభాగాల్లో పనిచేసిన తన అనుభవాన్ని ఉపయోగించి ఈ యాప్ ను తయారు చేయిస్తానని సునీల్ తెలిపారు. అలాగే కాల్ సెంటర్ కూడా ప్రారంభించి సొల్యూషన్ ఇస్తానన్నారు. ఈ యాప్ ను నో ప్రాఫిట్- నో లాస్ విధానంలో నిర్వహిస్తానని పీవీ సునీల్ తెలిపారు. ఈ యాప్ ద్వారా తనకు వచ్చే డబ్బుల్ని కూడా పేదల సంక్షేమం కోసం వాడతామని ఆయన వెల్లడించారు. ప్రజలంతా తన ప్రయత్నాన్ని స్వాగతించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+