రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి అన్నీ గండాలే!

జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని దేవుడిని కర్మఫలాలను అందించే గ్రహంగా, న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. 2026 ఆగస్టు 20న గురువారం రోజున శని రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు చంద్ర గ్రహణానికి ముందు జరగనుంది. 2026లో రెండవ, చివరి చంద్ర గ్రహణం ఆగస్టు 28న శుక్రవారం రోజున సంభవించనుంది.

రేవతి నక్షత్రంలో శని సంచారం

ప్రస్తుతం శని వక్రగతిలో ఉంది. ఈ స్థితి డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఆగస్టు 20 రాత్రి 10.03 గంటలకు రేవతి నక్షత్రంలో శని సంచారం ప్రారంభం కానుంది. రేవతి 27వ నక్షత్రం. దీని అధిపతి బుధుడు. శని ఈ నక్షత్రంలో అక్టోబర్ 9 వరకు సంచరిస్తుంది. దాదాపు 50 రోజుల పాటు ఈగ్రహ సంచారం కారణంగా మేష, కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురుకావచ్చు.

shani gochar Saturn enters Revati Nakshatra on August 20 unluck to these zodiac signs be alert

మేష రాశి:

ఈ కాలంలో మేషరాశి జాతకుల ఖర్చులు పెరగవచ్చు. మానసిక ఒత్తిడి, అనవసరమైన ప్రయాణాలు పెరగవచ్చు. ఈ సమయంలో మేషరాశి జాతకులు తొందరపాటుగా పెట్టుబడులు పెట్టకూడదు. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు కానీ తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులను నియంత్రించి పొదుపు చేయాలి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి జాతకులకు అదృష్టం, విద్య, దూర ప్రయాణాలు, ముఖ్యమైన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో విబేధాలు రావచ్చు. న్యాయస్థానం, ప్రభుత్వ పనుల్లో పత్రాలపై శ్రద్ధ పెట్టాలి. పెట్టుబడులు పెట్టే ముందు అలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి జాతకులకు జీవితం, పిల్లలు, ప్రేమ జీవితం విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో పనులు పూర్తి కావటానికి ఎక్కువ సమయం పడుతుంది . షేర్ మార్కెట్, లాటరీ వంటి పెట్టుబడుల్లో నష్టాలు రావచ్చు. విద్యార్థులు చదువులో ఏకాగ్రత కోసం కష్టపడాల్సి రావచ్చు. ప్రేమ జీవితంలో అపార్థాలు రావచ్చు. మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి.

బృహస్పతి ఉదయంతో నేటినుండి ఈ రాశులవారి జీవితంలో వెలుగులు
బృహస్పతి ఉదయంతో నేటినుండి ఈ రాశులవారి జీవితంలో వెలుగులు

మకర రాశి:

వృత్తి జీవితం, ఆర్థిక విషయాల్లో మకర రాశి జాతకులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతల వల్ల ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగ మార్పు లేదా పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఈ 50 రోజుల కాలంలో పై నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండి, అనవసర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+