రాష్ట్రంలోని పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంపు..

పోలీస్ ఉద్యోగాల నియామకం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 2 సంవత్సరాలు పెంచింది. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పోస్టుకు 32 ఉండగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జనరల్ అభ్యర్థి అయితే గరిష్ఠంగా 29 ఏళ్లు ఉన్నవాళ్లు అర్హులు. ఇకపై ఎస్సై పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 37 ఏళ్లుగా ఉండనుంది.

ఈ మేరకు తెలంగాణలోని యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలు అయిన పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్, ఫారెస్ట్ శాఖల్లోని ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా పోస్టులకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితి పెంపు మే 18, 2026 నుంచి అమల్లో ఉండగా తాజాగా మరో రెండేళ్లు అదనంగా పెంచింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆయా శాఖల్లోని పోస్టులకు వయోపరిమితి ఏడేళ్లకు చేరింది. ఇటీవలి కాలంలో నిరుద్యోగ యువత నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. ఇక తాజాగా విడుదలైన జీఓ కారణంగా పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మరింత మంది అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.

Telangana police aspirants Good news for uniform service job aspirants Telangana age limit raised

ఇక తెలంగాణ రాష్ట్రంలో 7,437 కొలువుల భర్తీకి టీఎస్​ ఎల్​పీఆర్​బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 19 న ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తులను అధికారిక వెబ్​ సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. ఎస్సై పోస్టులకు రూ. 750 (ఎస్సీ, ఎస్టీ), రూ. 1,500 ఇతరులకు ఫీజు ఉంటుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌ మెంట్ బోర్డు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+