Independence Day 2026:80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -భారత్‌లో పండగ వాతావరణం..!!

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.ఆనాడు దేశ సార్వభౌమత్వాన్ని చాటుతూ ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణ పతాకం,నేడు కూడా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని,గర్వాన్ని రగిలిస్తోంది.

ఈ మహోజ్వల సంబరాలకు ముందు రోజు,అంటే ఆగస్టు 14న దేశ విభజన నాటి దారుణాలను గుర్తుచేసుకునే 'విభజన భీభత్స స్మృతి దినం'గా పాటిస్తాం.స్వాతంత్ర్య సంబరాల వెనుక ఎందరో అమాయక ప్రాణాల బలిదానాలు,కుటుంబాల విడిపోయిన వేదన దాగి ఉన్నాయి.ఆ చేదు జ్ఞాపకాలను స్మరిస్తూనే,సాధించుకున్న స్వేచ్ఛ విలువను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి హృదయం ఆకాంక్షిస్తుంది.1947లో మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించిన ఈ పతాకావిష్కరణ సాంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది.

independence-day-2026-live-updates-from-red-fort-to-telugu-states-pm-modi-chandrababu-revanth-reddy

ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు,నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతి పౌరుడు శపథం పూనే పవిత్రమైన సమయం.భరతమాత స్వేచ్ఛా ప్రస్థానం తరతరాల త్యాగాల పునాదులపై నిర్మితమైందని మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.ఈ నేపథ్యంలో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిలు కూడా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Aug 15, 2026, 2:14 pm IST

జాతీయ జెండాను ఆవిష్కరించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.
Aug 15, 2026, 1:58 pm IST

జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి నివాళులు

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు
Aug 15, 2026, 1:55 pm IST

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్.
Aug 15, 2026, 1:54 pm IST

జాతీయ జెండా ఎగురవేసిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.
Aug 15, 2026, 1:53 pm IST

జాతీయ జెండా ఆవిష్కరించిన బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి
Aug 15, 2026, 12:33 pm IST

ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Aug 15, 2026, 12:32 pm IST

జాతీయ జెండాను ఎగురవేసిన పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి.
Aug 15, 2026, 11:19 am IST

జాతీయ జెండాను ఆవిష్కరించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.
Aug 15, 2026, 10:58 am IST

బాంబే హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్.
Aug 15, 2026, 10:28 am IST

జాతీయ జెండాను ఎగురవేసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే.
Aug 15, 2026, 10:26 am IST

జాతీయ జెండాను ఆవిష్కరించిన కేరళ సీఎం వీడీ సతీషన్.
Aug 15, 2026, 10:17 am IST

జాతీయ జెండాను ఎగురవేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
Aug 15, 2026, 10:09 am IST

గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
Aug 15, 2026, 9:37 am IST

కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Aug 15, 2026, 9:34 am IST

విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ మంత్రి నారా లోకేష్.
Aug 15, 2026, 9:16 am IST

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో సీఎం చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Aug 15, 2026, 9:11 am IST

జాతీయ జెండా ఆవిష్కరించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
Aug 15, 2026, 9:09 am IST

దేశ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ శుభాకాంక్షలు
Aug 15, 2026, 9:03 am IST

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తమిళనాడు సీఎం విజయ్

చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
Aug 15, 2026, 8:59 am IST

జనాభా గణన కార్యక్రమంలో పాల్గొనాలని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Aug 15, 2026, 8:59 am IST

మహిళలకు 33% రిజర్వేషన్‌కు ప్రధాని మోదీ మద్దతు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ చర్యకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని ప్రధాని కోరారు. అలాగే మహిళల అధికారాన్ని మరింత గౌరవించాలని పిలుపునిచ్చారు.
Aug 15, 2026, 8:57 am IST

'దిమాగీ నక్సల్స్'ను ఒంటరి చేయాలి: ప్రధాని మోదీ

సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న 'దిమాగీ నక్సల్స్' (అర్బన్ నక్సలైట్లు/మేధోపరమైన తీవ్రవాదం)ను సామాజికంగా ఒంటరిని చేయాలని దేశప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.దేశ సార్వభౌమత్వాన్ని, అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. దేశ ప్రగతికి ప్రతిబంధకంగా మారే విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కొంటూనే, 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతతో 2047 నాటికి 'వికసిత భారత్' కల సాకారం దిశగా ముందుకు సాగుతామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు.
Aug 15, 2026, 8:49 am IST

ఎరువుల ధరలపై ప్రధాని ప్రకటన

భారత్ తన సొంత బలంపై ఆధారపడి ముందుకు సాగుతోందని, ప్రపంచ సంక్షోభాల మధ్య రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధర బస్తాకు సుమారు రూ. 3,000 ఉండగా, భారత రైతులకు ఈ ఎరువును బస్తాకు రూ. 300కే అందిస్తున్నారని మోదీ అన్నారు. డీఏపీ ప్రపంచ మార్కెట్ ధర రూ. 5,000కు చేరినప్పటికీ, భారత రైతులకు దీనిని రూ. 1,350కే అందిస్తున్నారని ఆయన తెలిపారు.
Aug 15, 2026, 8:45 am IST

2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రధాని మోదీ సంచలన ప్రకటన

దేశవ్యాప్త క్రీడా ప్రతిభాన్వేషణను ప్రధాని మోదీ ప్రకటించారు. 2036 ఒలింపిక్స్‌లో ప్రతి క్రీడా ఈవెంట్‌లోనూ పోటీపడాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Aug 15, 2026, 8:40 am IST

భారతీయ కంపెనీలకు భారీ లక్ష్యాలు

ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దంలో ఫార్చ్యూన్ 500 జాబితాలలో 50 కంపెనీలు ఉండేలా భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, ప్రపంచంలోని అగ్ర ఐదు బ్యాంకులలో కనీసం ఒక భారతీయ బ్యాంకు ఉండాలని, ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో కనీసం ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ చోటు దక్కించుకోవాలని ఆయన అన్నారు.
Aug 15, 2026, 8:39 am IST

యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను ప్రకటించిన ప్రధాని
Aug 15, 2026, 8:37 am IST

'శక్తి కీ సప్తధార' గురించి వివరించిన ప్రధాని మోదీ

భారత అభివృద్ధికి ఏడు కీలక ప్రాధాన్యతా రంగాలను "శక్తి కీ సప్తధార"గా అభివర్ణిస్తూ ప్రకటించారు.ఆ ఏడు రంగాలు ఏవంటే తయారీ, వ్యవసాయం- ఆహార శుద్ధి, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గతి-శక్తి, రక్షా శక్తి, హరిత- నీలి ఆర్థిక వ్యవస్థ, భారతదేశపు సాఫ్ట్ పవర్. ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలంటే తయారీ రంగం పోటీ ధరలు, నాణ్యత, ఉత్పత్తి పరిమాణంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ అన్నారు. భారత వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తులను ప్రపంచ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్, కమ్యూనికేషన్ టెక్నాలజీలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆయన గతి-శక్తి కింద వేగవంతమైన, నిరాటంకమైన కనెక్టివిటీని, రక్షాశక్తి కింద డ్రోన్లు, సూపర్‌సోనిక్ టెక్నాలజీతో సహా అత్యాధునిక రక్షణ సాంకేతికతలను, అలాగే హరిత, నీలి ఆర్థిక వ్యవస్థలలో భారతదేశానికి ఉన్న అపారమైన వనరులను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. సాఫ్ట్ పవర్ అంశంపై ప్రధాని మోదీ యోగా, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్యం, సృజనాత్మక వనరులు, పర్యాటకం వంటివాటిని ప్రముఖంగా ప్రస్తావించారు.
Aug 15, 2026, 8:21 am IST

'సప్తధార' ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ

వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు 'సప్తధార'గా తాను అభివర్ణించిన ఏడు సూత్రాల సంస్కరణల అజెండాను అమలు చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు.
Aug 15, 2026, 8:13 am IST

భారతదేశం ఎన్నో కలలతో స్వాతంత్ర్యం పొందిందని, కానీ “అవుతుందిలే”, “వెళ్తుందిలే” , “అయిపోతుందిలే” , “ చూసిపోతాంలే” అనే వైఖరి కారణంగా చాలా ఏళ్లుగా పురోగతి సాధించడంలో విఫలమైంది. -ప్రధాని మోదీ
Aug 15, 2026, 8:12 am IST

భారత ఇంధన అవసరాలను తీర్చుకునే ప్రయత్నాలలో భాగంగా మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. -ప్రధాని మోదీ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+