RTC Jobs: డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) చేసిన ఆత్మబలిదానం కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన నింపింది. గురువారం బస్టాండ్ ఎదుట నిప్పంటించుకున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత పెరిగింది.

మరోవైపు, సమ్మె వల్ల సామాన్య ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

TGSRTC Strike Update Government Starts Hiring Temporary Drivers and Conductors to Restore Bus Services
  • హైదరాబాద్‌లోని డిపోలు: ఉప్పల్, చెంగిచెర్ల, కుషాయిగూడ, రాణిగంజ్, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మియాపూర్-1 & 2, హెచ్‌సీయూ వంటి డిపోల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి.
  • అర్హతలు: డ్రైవర్లకు హెవీ లైసెన్స్, కండక్టర్లకు పదో తరగతి ఉత్తీర్ణతను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జిల్లాల్లో కూడా ఇదే తరహాలో నియామకాలు చేపట్టి బస్సులను రోడ్డెక్కించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం - డ్రైవ‌ర్ ఆత్మహ‌త్యా యత్నం..!!
ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం - డ్రైవ‌ర్ ఆత్మహ‌త్యా యత్నం..!!

ఆత్మహత్యలు వద్దు.. ఇది మీ ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

సమ్మెపై గురువారం క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మికులు ప్రాణాలు తీసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఆర్టీసీ కార్మికులు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఇది మీ ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరూ అనాలోచితంగా ప్రాణాలు తీసుకోవద్దు" అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2013 పీఆర్‌సీ బకాయిలను విడుదల చేశామని, మిగిలిన 32 డిమాండ్లపై సానుకూల ధోరణితో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

అర్ధరాత్రి నుంచే ఆగిపోయిన ఆర్టీసీ. ప్రయాణికులకు చుక్కలు
అర్ధరాత్రి నుంచే ఆగిపోయిన ఆర్టీసీ. ప్రయాణికులకు చుక్కలు

ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం.. చర్చలకు రండి!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఏ ఒక్క కార్మికుడినీ ఉద్యోగం నుంచి తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినా ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదని, కారుణ్య నియామకాలు, విలీనం వంటి అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు. బయటి వ్యక్తుల ప్రోద్బలంతో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ అత్యవసర భేటీ అయింది. ప్రభుత్వంతో చర్చలే అజెండాగా ఈ సమావేశం జరగ్గా.. 29 అంశాలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చేబుతుంది.. ఈ క్రమంలోనే కీలకమైన మూడు అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+