బొప్పాయితో బరువుకు చెక్.. షుగర్ కు బెస్ట్, ఇంకా బోలెడు హెల్త్ బెనిఫిట్స్!

బొప్పాయి పండు .. మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే పండు.. ఇందులో మన శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు ఉంటాయి. పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువును నియంత్రిస్తుంది. బొప్పాయిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకునే ఆలోచన ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి తింటే బరువుకు చెక్

బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు బాగా తగ్గుతారు. ఎందుకంటె బొప్పాయిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా పదేపదే తినాలి అనే ఫీలింగ్ లేకుండా పోతుంది. బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు. అయితే పండిన బొప్పాయినే కాదు పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి.

Health tips health benefits with riped papaya raw papaya and papaya leaves this is the best fruit for health

డయాబెటిస్ కంట్రోల్ కు బొప్పాయి బెస్ట్

పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

పచ్చి బొప్పాయితో బోలెడు బెనిఫిట్స్

ఎవరికైనా గాయాలు అయితే ఆ గాయాలపై బొప్పాయి గుజ్జును రాయడం వల్ల కూడా గాయాలు త్వరగా నయం అవుతాయి. పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పచ్చి బొప్పాయి శరీరం నుంచి వ్యర్ధాలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

క్రిస్పీగా, టేస్టీగా అరటికాయ వేపుడు ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!
క్రిస్పీగా, టేస్టీగా అరటికాయ వేపుడు ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!

బొప్పాయి పండు, కాయ, ఆకులు కూడా పోషకమే

బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది. పచ్చి బొప్పాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది. పొఫైన్ , చైమో పోపైన్ లు శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+