వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!

సింగరేణి మరో హిస్టరీ నమోదు చేసింది. ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని అధికారులు పేర్కొన్నారు.ఒడిశా నుంచి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేకుకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ ,ఎం. తిరుమల రావు ఘన స్వాగతం పలికారు.

మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ సింగరేణి సొంతం.. చారిత్రక విజయం: భట్టి విక్రమార్క
మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ సింగరేణి సొంతం.. చారిత్రక విజయం: భట్టి విక్రమార్క

నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణికి బొగ్గు.. చారిత్రాత్మకం అన్న డిప్యూటీ సీఎం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, అధికారులు, కార్మికులకు విడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ రేక్ ద్వారా బొగ్గు రావటం నిజంగా సంతోషించదగిన విషయమని, చారిత్రాత్మక సందర్భమని ఆయన అభిప్రాయపడ్డారు.

Singareni Creates History First Coal Rake from Odisha Naini Mine Reaches Mancherial Thermal Plant deputy cm bhatti comments

రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తున్న సింగరేణి

రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని జెన్‌కో ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌తో పాటు, సింగరేణి కూడా పవర్ జనరేషన్‌లో భాగస్వామ్యమై విద్యుత్ ప్రాజెక్టులు నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. సింగరేణి కాలరీస్ రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును సరఫరా చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జెన్‌కో, సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తుందన్నారు .

చరిత్ర సృష్టించనున్న సింగరేణి.. భారీ డంపర్ ల డ్రైవర్ లుగా మహిళలు!
చరిత్ర సృష్టించనున్న సింగరేణి.. భారీ డంపర్ ల డ్రైవర్ లుగా మహిళలు!

వరుస విజయాలపై మంత్రి భట్టి

పెరుగుతున్న రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రక్రియ కొనసాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే మనం 'తాడిచర్ల-2' బ్లాక్‌ను పొందామని, నైనీ కోల్ బ్లాక్‌ను ఆపరేషన్లోకి తీసుకువచ్చి బొగ్గును వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మొదటి రైల్ రేక్ వచ్చిందన్నారు. అలాగే ఇటీవల మనుగూరు బ్లాక్ ను వేలంలో పాల్గొని దానిని కూడా దక్కించుకున్నామన్నారు.

తెలంగాణా సర్కార్ కు అద్భుతమైన ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి

భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను పొందటానికి సింగరేణి కాలరీస్‌కు రాష్ట్రప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ అంతా సింగరేణిని మరింత బలోపేతం చేయాలని భావిస్తోందన్నారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న సింగరేణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ప్రభుత్వరంగ సంస్థ అని కొనియాడారు. ఇటువంటి సంస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

భవిష్యత్ లో సింగరేణి ఆ పనులు చెయ్యాలన్న మంత్రి భట్టి

రాబోయే వందేళ్లలో సింగరేణి కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాల్లోకి కూడా అడుగుపెట్టాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీపడే స్థాయికి సింగరేణి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. సింగరేణికి అవసరమైన అత్యాధునిక మైనింగ్ యంత్రాలు ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో పరిశీలిస్తున్నామన్నారు.

భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించే నూతన ప్రక్రియ నేడే మొదలు

ఇందులో భాగంగా క్యాటర్‌పిల్లర్ కంపెనీకి చెందిన మైనింగ్ పరికరాలు, మైనింగ్ విధానం, అలాగే నూతన సాంకేతిక ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. నైనీ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ బొగ్గు సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చేరుకున్న ఈ శుభ సందర్భంలో సింగరేణిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు . భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించే ఈ నూతన ప్రక్రియ మొదలైన నేటి రోజు ఒక చారిత్రాత్మకమైన రోజని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+