Amaravati ORR రూట్ ఇలా: 23 మండలాలు, 121 గ్రామాలు- గేమ్ ఛేంజర్..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధానిలో నిర్మాణాలు క్రమేణా వేగం పెరుగుతున్నాయి. 2028 చివరి నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా నిర్ణయించింది. అమరావతి ఓఆర్ఆర్ పైనా వేగంగా అడుగులు పడుతున్నాయి. నాలుగు ప్యాకేజీలు ఈ నిర్మాణం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా NHAI టెండర్లు ఆహ్వానించింది. ఈ ఓఆర్ఆర్ రూట్ ఖరారైంది. మండలాలు, గ్రామాలు ఫిక్స్ చేసారు. ఈ నిర్మాణం గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకొంటు న్నాయి. ఓఆర్‌ఆర్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. మొత్తం 189.93 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను రూ.13,091.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. మొత్తం ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రాజధాని అమరావతిని పలు ప్రాంతాలకు అనుసంధానించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. మొత్తం 4 ప్యాకేజీలలో దీన్ని చేపట్టనుని డిసైడ్ అయ్యారు. డిజైన్-బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్(డీబీవోటీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) విధానాలలో చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. నవంబరు 18 వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. నవంబరు 19న టెండర్లు ఓపెన్ చేస్తారు. డీబీవోటీ, హ్యామ్ విధానాల్లో టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణవ్యయంలో 40 శాతం నిధులను నిర్మాణ సమయం(మూడేళ్లు)లో చెల్లిస్తారు.

టెండర్లు ఆహ్వానం .. రూట్ ఫిక్స్
కాగా, తరువాత 15 ఏళ్ల వరకు ఏడాదికి 2 వాయిదాలు చొప్పున మొత్తం 30 వాయిదాలలో వడ్డీతో సహా కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తి కాగానే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 30 వాయిదాలలో చెల్లించేలా టెండర్లు ఆహ్వానించారు.ఈ ఓర్ఆర్ఆర్ పరిధిలోకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల పరిధిలో మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది. వీరుల పాడు మండలంలోని పొన్నవరం, జగన్నాధపురం, తిమ్మాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, నరసింహారావుపాలెం, కంచికచర్ల..జీకొండూరు..మైలవరం మండల పరిధిలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాలు ఓఆర్‌ఆర్ పరిధిలోకి వస్తాయి. అదే విధంగా గన్నవరం మండలంతో పాటుగా బాపులపాడు..ఉంగుటూరు, కంకిపాడు, తోట్ లవల్లూరు మండలంలో రొయ్యూరు, ఉత్తరవల్లూరు, చిన్నపులిపాక, బొడ్డపాడు, దక్షిణ వల్లూరు గ్రామాలు ఉన్నాయి. ఇక.. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలో బొడ్డనపల్లి, గరికపాటి వారి కండ్రిక, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, నరసింగపాలెం, కృష్ణవరం, సగ్గూరు, సూరవరం, కల్లటూరు గ్రామాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మేడికొండూరు, తాడికొండ, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర,చేబ్రోలు, వట్ టిచెరుకూరు, పెదకూరపాడు సహా అమరావతి మండలంలోని ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాలు ఓఆర్‌ఆర్ పరిధిలోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications
