ఎల్ నినో తెచ్చిన కరవు: ఏపీ, తెలంగాణాతో సహా కరవుప్రాంతాల గుర్తింపుకు కేంద్రం మార్గదర్శకాలు

ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరవు ప్రాంతాలను గుర్తించడంలో ఇకపై ఊహాగానాలకు తావు లేదు. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక సాధనాలు ఉపయోగించి ఖచ్చితంగా నిర్ధారించాలని కేంద్రం సూచించింది. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాల ప్రకారం నివేదికలు రూపొందించి సమర్పించాలి.

 కరువు తీరా, ప్రాజెక్టులకు జలకళ - ఎల్‌నినో ప్రభావానికి చెక్‌..!!
కరువు తీరా, ప్రాజెక్టులకు జలకళ - ఎల్‌నినో ప్రభావానికి చెక్‌..!!

మొట్టమొదటిసారిగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సూచికలు ఆధారంగా కరవును గుర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు తయారు చేశారు. వర్షపాతంలో తేడా, పొడి వాతావరణం, సాగు విస్తీర్ణం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, జల ప్రవాహాలు, పశుగ్రాసం లభ్యత, భూగర్భ జలాలు, తాగునీరు, ఉపాధి పరిస్థితి, వలసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది .

 ఎల్‌నినో కష్టాల వేళ బిగ్ రిలీఫ్, శ్రీశైలానికి భారీ వరద- నెక్స్ట్ ఇక.!!
ఎల్‌నినో కష్టాల వేళ బిగ్ రిలీఫ్, శ్రీశైలానికి భారీ వరద- నెక్స్ట్ ఇక.!!
drought-hit areas Scientific and Technology-Based Identification of Drought Areas Centre Issues New Guidelines

సాగు విస్తీర్ణం సాధారణ స్థాయితో పోల్చి చూస్తే 85 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని కరవుగా గుర్తించాలి. 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే తీవ్రమైన కరవుగా పరిగణించాలి. ఉపగ్రహాల ద్వారా వచ్చే నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ సాయంతో పంటల పచ్చదనం, నీటి శాతాన్ని అంచనా వేయాలి. నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ ద్వారా మొక్కలు, నేలలోని తేమను గుర్తించాలి.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 20 శాతం తక్కువ ఉంటే సాధారణ కరవు, 20 నుంచి 40 శాతం తక్కువ ఉంటే తీవ్రమైన కరవు, 40 నుంచి 60 శాతం తక్కువ ఉంటే అతి తీవ్రమైన కరవుగా పరిగణించాలని కేంద్రం సూచించింది. భూగర్భ జలాల విషయంలో 15 శాతం తగ్గితే సాధారణ, 16 నుంచి 45 శాతం తగ్గితే తీవ్ర, 46 నుంచి 60 శాతం తగ్గితే అతి తీవ్ర కరవుగా గుర్తించాలని పేర్కొంది.

వర్షపాతం సాధారణం కంటే 19 శాతం తక్కువ ఉంటే సాధారణ లోటు, 20 నుంచి 59 శాతం తక్కువ ఉంటే తీవ్రమైన లోటు, 60 నుంచి 99 శాతం తక్కువ ఉంటే అతి తీవ్రమైన లోటుగా నిర్ధారించాలని మారదర్శకాలలో పేర్కొంది. మూడు నుంచి నాలుగు వారాలపాటు వర్షం లేకపోవడం లేదా సాధారణ వర్షపాతంలో 50 శాతం కంటే తక్కువ నమోదైనా తీవ్రమైన కరవుగా గుర్తించాలని కేంద్రం సూచించింది.

ఈ మార్గదర్శకాలు అమలు అయితే కరవు ప్రాంతాలకు సహాయం సకాలంలో అందించడం సులభం అవుతుంది. రైతులకు, పశువులకు, తాగునీటి సమస్యలకు తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలకు స్పష్టమైన ఆధారాలు లభిస్తాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ మార్గదర్శకాల ప్రకారం వివరాలు సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+