పిఠాపురం కు కొత్త లుక్ - తాజా నిర్ణయం, మోడల్ నియోజకవర్గంగా..!!
పిఠాపురం. ఇప్పుడు నియోజకవర్గంలో పూర్తిగా రూపు రేఖలు మారిపోతున్నాయి. పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా నియోజకవర్గం పైన ఫోకస్ చేసారు. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామనే హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. రోడ్ల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఇప్పటి కే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తయ్యాయి. ఇక.. అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే పిఠాపురంకు కొత్త రూపు రానుంది.
పిఠాపురం నియోజకవర్గంలో పలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ గ్రామీణ రహదారుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వ నిధులను ఉపయోగించి 307 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ. 200 కోట్లకు పైగా కేటాయించారు. ఇప్పటివరకు 152 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 611 రహదారుల పనులు పూర్తయ్యాయి, మరికొన్ని డజన్ల కొద్దీ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, వీటి మొత్తం పొడవు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కిపైగా రోడ్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. లక్ష్యాల్లో దాదాపు 80 శాతం పూర్తి కావడంతో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రాకపోకలు సులభంగా మారాయి.

పవన్ కల్యాన్ కీలక సూచనలు
నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, మత్స్యకార గ్రామాలను అనుసంధానించే విధంగా రోడ్ల పనులకు రూపకల్పన చేశారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రహదారి తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఈ రహదారిని రూ.88 లక్షలతో పునర్నిర్మించడంతో రెండు వేల మందికి పైగా ప్రజలకు ప్రయాణ సౌకర్యం లభించింది. అభివృద్ధి పనుల పై సమీక్ష చేసిన పవన్ కల్యాణ్ నిర్మాణం జాప్యం జరిగిన 70 కిలోమీటర్ల పెండింగ్ రోడ్లు నిర్ణీత గడువు లోపే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసారు.



Click it and Unblock the Notifications