ఏపీలో బర్త్, డెత్ సర్టిఫికెట్స్ కు కొత్త రూల్స్!

ఆంధ్రప్రదేశ్‌లో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 1 నుండి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో ఈ నియమాలు వర్తిస్తున్నాయి. జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు నమోదు చేస్తే సర్టిఫికెట్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈ గడువులోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

21 రోజులు దాటితే ఆలస్య నమోదు నియమాలు వర్తిస్తాయి. 1 నుంచి 2 సంవత్సరాల లోపు ఆలస్యమైతే జిల్లా మేజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు అవసరం అవుతాయి.2 సంవత్సరాలు దాటితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకుని మాత్రమే జనన , మరణ ధృవీకరణ పత్రాలను నమోదు చేసుకోవచ్చు.

AP Birth and Death Certificates New Rules 2026 - Free if Registered in 21 Days know the new rules

జనన, మరణ సర్టిఫికెట్లు చాలా అవసరమైన పత్రాలు. పాఠశాలలో చేరిక, పాస్‌పోర్ట్, ఆధార్, బ్యాంక్ ఖాతా, వారసత్వ హక్కులు, ఉద్యోగాలు వంటి అనేక అవసరాలకు ఇవి తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఆలస్యం చేస్తే అదనపు ఖర్చు, సమయం వృధా కావడమే కాకుండా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కనుక జనన, మరణ ధృవీకరణ పత్రాలను తీసుకోవటంలో జాప్యం చేయకుండా 21 రోజులలోగా దరఖాస్తు చేసుకోవటం మంచిది.

గతంలో కూడా జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు నమోదు చేస్తే సాధారణంగా ఉచితంగానే ధృవీకరణ పత్రం ఇచ్చేవారు. కానీ ఆలస్యమైతే నిబంధనలు కాస్త గందరగోళంగా ఉండేవి. 21 రోజులు దాటి 30 రోజుల లోపు అయితే కొంత ఆలస్య రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఒక నెల నుంచి ఒక సంవత్సరం లోపు ఆలస్యమైతే రిజిస్ట్రార్ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు అవసరమయ్యేవి.

ఒక సంవత్సరం దాటితే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లేదా జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకోవాల్సి వచ్చేది. చాలా చోట్ల స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ప్రజలు ఏ అధికారిని సంప్రదించాలో అర్థం కాక, అనవసరంగా తిరగాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో అదనపు రుసుములు, ఆలస్యం కూడా ఎదుర్కొనేవారు. ఇప్పుడు అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు మరింత స్పష్టంగా, ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి.

అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. రూ.599 కోట్ల రైల్వేలైన్‌కు టెండర్లు!
అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. రూ.599 కోట్ల రైల్వేలైన్‌కు టెండర్లు!

21 రోజుల్లోగా నమోదు చేస్తే పూర్తిగా ఉచితం అని స్పష్టంగా నిర్దేశించారు. దీనివల్ల ప్రజలు త్వరగా నమోదు చేసుకునే అవకాశం పెరుగుతుంది. ఆలస్య నమోదు విషయంలోనూ స్పష్టత వచ్చింది. 1 నుంచి 2 సంవత్సరాల లోపు ఆలస్యమైతే జిల్లా మేజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు అవసరం కాగా, 2 సంవత్సరాలు దాటితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్పష్టంగా చెప్పడం వల్ల ప్రజలకు ఏ అధికారిని సంప్రదించాలో తేలిగ్గా అర్థమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+