తెలంగాణలో SIR అరాచకాలు..! కారణం చెప్పకుండానే 2 లక్షల నోటీసులు ?

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఒక్కొక్కటిగా ఇందులో అక్రమాలు బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఎస్ఐఆర్ లో చేసిన పనులు ఒక్కో రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియలో జారీ చేసిన 2 లక్షలకు పైగా నోటీసుల్లో ఎలాంటి కారణం పేర్కొనలేదని తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది.

SIRలో తీసేసిన ఓటర్లను మళ్లీ చేరిస్తే జైలుకే ? ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన మాజీ సీఈసీ..!
SIRలో తీసేసిన ఓటర్లను మళ్లీ చేరిస్తే జైలుకే ? ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన మాజీ సీఈసీ..!

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై సబర్ ఇన్‌స్టిట్యూట్ , కాన్‌స్టిట్యూషనల్ గార్డియన్స్ ఫోరమ్ ఎన్నికల డేటా విశ్లేషణ నిర్వహించాయి. ఇందులో 2,01,249 మంది ఓటర్లకు జారీ చేసిన నోటీసులలో వ్యత్యాసానికి గల కారణం ఏదీ చెప్పకుండా నోటీసులో ఖాళీగా వదిలేసినట్లు తేలింది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 92.85 లక్షల వ్యత్యాస నోటీసులను పరిశీలించారు. వీటిలో అత్యధిక సంఖ్యలో గత ఎస్ఐఆర్ తో అనుసంధానించబడనివే ఉన్నాయి. ఇలాంటివి 32.37 లక్షల నోటీసులు ఉండగా.. మరో 25.97 లక్షల నోటీసులు తల్లిదండ్రుల పేర్లలోని వ్యత్యాసాలకు సంబంధించినవి ఉన్నాయి. ఓటర్ల సొంత పేర్లలోని వ్యత్యాసాలకు సంబంధించి మరో 11.14 లక్షల నోటీసులు జారీ అయ్యాయి.

Telangana SIR 2 Lakh Voters Receive Notices With No Reason for Discrepancy Mentioned
ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!
ఈసీ ఉక్కిరి బిక్కిరి..! SIR పూర్తయిన రాష్ట్రాల్లో మరో స్పెషల్ డ్రైవ్..!

హైదరాబాద్ సరిహద్దు నియోజకవర్గాలైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 66.6% మందికి నోటీసులు అందగా, ఆ తర్వాతి స్థానాల్లో కూకట్‌పల్లి (65.4%), ఉప్పల్ (57%), మేడ్చల్ (56%), శేరిలింగంపల్లి (55.8%) ఉన్నాయి. అలాగే ముస్లిం ఓటర్లకు సంబంధించిన నోటీసులు 14.16% (అంటే 13.14 లక్షలు) ఉన్నాయి. బహదూర్‌పుర, చంద్రాయణగుట్ట, కార్వాన్ , యాకుత్‌పుర వంటి హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో వీరి వాటా ఎక్కువగా ఉంది. బహదూర్‌పురలో నోటీసులలో ముస్లింల పేర్లు 85.18% ఉండగా, చంద్రాయణగుట్టలో 71.15%, కార్వాన్‌లో 54.56%, యాకుత్‌పురలో 61.16% ఉన్నాయి. ఈ నోటీసులలో పేర్కొన్న కారణాలు భిన్నంగా ఉన్నాయి. గత ఎస్ఐఆర్ తో లింక్ కాని ఓటర్లు, తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలు, సొంత పేర్లలో వ్యత్యాసాలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య వయస్సు వ్యత్యాసాలు, సోదరులు, సోదరీమణుల మధ్య తొమ్మిది నెలల కంటే తక్కువ వయస్సు అంతరం ఉండటం వంటి కారణాలున్నాయి. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న సందర్భాల్లో కూడా నోటీసులు జారీ చేశారు. ఈ విభాగంలో జారీ అయిన నోటీసులలో 50.5% ముస్లిం పేర్లకు సంబంధించినవే ఉన్నాయని న్యూస్ మినిట్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+