AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!

ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లకు వారి ఇళ్లవద్దకు వెళ్లి బీఎల్వోలు ఎస్ఐఆర్ నమోదు ఫారాలు అందజేయడం, తిరిగి వివరాలు నింపాక తీసుకోవడం పూర్తయింది. అనంతరం పేర్లు, ఇతర వివరాలు తేడా ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా కూడా విడుదల చేశారు. ఈ జాబితాలో పేర్లు లేని, వారు, ఉన్నా వివరాలు తేడా ఉన్న వారిని విచారణకు పిలిపించి, అర్హులైతే ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు. అయితే తాజాగా ఇలా ఓటర్లను తమ వద్దకు తిప్పుకోవడంపై ఈసీ విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది.

మరో షాకింగ్: SIR పూర్తి కాగానే వీఆర్ఎస్ దరఖాస్తు- సీఈఓ సంచలనం..!
మరో షాకింగ్: SIR పూర్తి కాగానే వీఆర్ఎస్ దరఖాస్తు- సీఈఓ సంచలనం..!

ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. మ్యాపింగ్ కాకపోవడం, లాజికల్ డిస్క్రెపెన్సీలకు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవల్ అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి ఈసీఐ నెట్ యాప్ లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో ఓటర్లు తప్పనిసరిగా ఈఆర్వో లేదా ఏఈఆర్వో కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో ఈఆర్వో నిర్ణయం మేరకు విచారణ నిర్వహించవచ్చు.

AP SIR BLOs to Visit Homes of Voters Facing Unmapped Logical Discrepancy Notices
ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!
ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!

వీలైనంత వరకు ఈ విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఈసీ సూచించింది. అక్టోబర్ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి 209 కేసులు విచారణ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఓటరు తరఫున కుటుంబంలోని మరో వయోజన సభ్యుడిని విచారణకు హాజరయ్యేందుకు అధీకృతం చేయవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ విచారణకు సంబంధించిన సౌకర్యాలను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. అలాగే రాత్రి ఆశ్రయ కేంద్రాల్లో నివసించే వారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయులు తదితరుల కోసం జిల్లాల వారీగా తగిన సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌లు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.ఎస్ఐఆర్ కు సంబంధించిన ఫామ్ 6కు జత చేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. ఎస్ఐఆర్ లో లేదా ఆ తర్వాత తమ పేరు ఓటర్ల జాబితాలో లేకపోయిన వారు, అలాగే యువత, తొలిసారి ఓటర్లు సహా అర్హులైన ఎవరైనా నిరంతర అప్‌డేషన్ ప్రక్రియ ద్వారా సంబంధిత ఈఆర్వోలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+