స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్ - నో కాంప్రమైజ్..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. రెండు వైపులా కేడర్ కు ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం జరిగింది. కూటమిలో సీట్ల సర్దుబాటు పైన మూడు పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, స్థానిక ఎన్నికల పైన పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సమయంలోనే పవన్ తీసుకున్న నిర్ణయం పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.

స్థానిక ఎన్నికల్లో పవన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు.. పోటీ పైన సొంత పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. కూటమికి నష్టం చేయకుండా... అవసరమైన చోట ఫ్రెండ్లీ కంటెస్ట్ కోసం బరిలోకి దిగవచ్చని పవన్ వెల్లడించారు. ఎన్నికల కోసం గతంలోనే పవన్ పలు కమిటీలను నియమించారు. కాగా.. ఇక త్యాగాలు వద్దని.. బలం పెంచుకోవటానికి ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పవన్ డిసైడ్ చేసారు. ఇక.. ఇప్పుడు పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ తరఫున పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయం, పర్యవేక్షణకు నూతన కమిటీలను నియమించాలని నిర్ణయించారు. గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు, వారికి అనుబంధంగా ఉన్న సపోర్ట్‌ టీమ్స్‌ చెల్లుబాటులో ఉండవని పార్టీ ప్రకటించింది. 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు కమిటీలను రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

 తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!!
pawan-kalyan-to-form-new-committees-for-local-body-polls-moving-with-new-strategies-here-the-repor

ఏరీ కోరి ఎంపిక చేసిన వారికి బాధ్యతలు

ఇటీవల రాష్ట్రస్థాయిలో స్థానిక ఎన్నికల కోసం నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ, ప్రచార కమిటీలు యథావిధిగా విధులు నిర్వహిస్తాయని స్పష్టత ఇచ్చారు. కొత్త కమిటీలను త్వరలోనే నియమించేలా పవన్‌ కల్యాణ్‌ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా బలంగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీలతో సహా జిల్లా పరిషత్ ల పైన పవన్ వివరాలను సేకరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి పోటీకి అవకాశం ఇవ్వాలని నేతలకు పవన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ తరువాత కూటమి సమన్వయ కమిటీలు సీట్ల సర్దుబాటు పైన అంచనాకు రానున్నారు. చంద్రబాబు, పవన్, మాధవ్ పోటీ స్థానాల పై తుది నిర్ణయం తీసుకునే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఇక.. పవన్ కొత్త కమిటీలు పూర్తిగా తాను ఏరి కోరి ఎంపిక చేసిన వారితో ప్రకటించనున్నారు. స్థానిక ఎన్నికల వేళ పవన్ ఏ నిర్ణయంతోనూ రాజీ పడటం లేదు. పూర్తిగా అధ్యయనం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+