తెలంగాణాలో ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక!

ఎల్ నినో ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఎల్ నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో ఆశించిన వర్షపాతం లేక రైతులు చాలా ప్రాంతాల్లో పంటలు వేయలేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా వంటి రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఏర్పడింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. పంటల సాగుకు నీళ్ళు లేక రైతులు పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షాలపై శుభవార్త చెప్పింది. నేడు ఉత్తర, తూర్పు జిల్లాలైన అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

telangana rains IMD Forecasts Rains Today and Tomorrow mainly in northern and eastern telangana districts

దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడా చిరుజల్లులు పడవచ్చు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది.
రాబోయే వారంలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చు.

ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో నిలబడకూడదు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పంటల రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏపీలో నేడు, రేపు దంచికొట్టనున్న వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఏపీలో నేడు, రేపు దంచికొట్టనున్న వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

ఇక హైదరాబాద్ లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో సాయంత్రం వేళల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణలో యధావిధిగా వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+