మంత్రుల సమర్థతకు చంద్రబాబు పరీక్ష, బిగ్ టాస్క్..!!
ఏపీ మంత్రులకు బిగ్ టాస్క్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి సారి ప్రజల నాడి తెలుసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందు కోసం కూటమి నేతలను సిద్దం చేస్తోంది. 26 నెలల పాలన పైన ప్రజలకు వివరిస్తూ... స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్ల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు. దీంతో.. ఇప్పుడు ఈ ఎన్నికలు వారి సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి.
ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీల నేతలు ప్రాధమిక చర్చలు పూర్తి చేసారు. ప్రతీ జిల్లాలోనూ ఈ ఎన్నికల కోసం సమన్వయ కమిటీ లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. పార్టీల పరంగా సీట్ల షేరింగ్ పైన అధినేతలు చర్చించి నిర్ణయానికి రానున్నారు. 2024 ఎన్నికల ఫార్ములా అమలు కాదని... తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని జనసేన నేత మనోహర్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల వేళ మూడు పార్టీల నుంచి మంత్రులుగా ఉన్న వారికి టాస్క్ ఫిక్స్ చేసారు. ఈ రోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేష్ సమావేశం అయ్యారు. అనుకున్న సమయానికే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయన్నారు మంత్రి లోకేష్ స్పష్టం చేసారు.

మంత్రులకు కీలక దిశా నిర్దేశం
మంత్రులు ఈ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటి వద్దా కనీసం 3 నిమిషాలైనా ఉండి వివరించాలని దిశానిర్దేశం చేశారు లోకేష్. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై లోకేశ్ మంత్రుల తో చర్చించార- ఎల్‌నినో పరిస్థితులు ప్రజలకు అసెంబ్లీ వేదికగా వివరిద్దామని చెప్పారు. జలాశయాల్లోకి వరద రావడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పేర్కొన్నారు.
తొలి ప్రాధాన్యం తాగునీరు, ద్వితీయ ప్రాధాన్యం పశుగ్రాసానికి ఇవ్వాలని సూచించారు. సీఎం చంద్రబాబు సైతం ఇప్పటికే మంత్రులు.. పార్టీ నేతలకు స్థానిక ఎన్నికల పైన స్పష్టత ఇచ్చారు. ప్రతీ స్థానంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని డిసైడ్ అయ్యారు. కేబినెట్ ప్రక్షాళన పైన చర్చ వేళ.. స్థానిక ఎన్నికలే మంత్రుల పదవుల కొనసాగింపుకు కొలమానంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.



Click it and Unblock the Notifications