ఆ అమ్మాయితో అలా బ్రేకప్... లవ్‌స్టోరీ బయటపెట్టిన జేసన్ సంజయ్
సాధారణంగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు.. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. కొన్నేళ్లుగా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. కోలీవుడ్ అగ్రనటుడిగా తన తండ్రికి ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా.. జేసన్ సంజయ్ కూడా విజయ్ దారిలో హీరోగా అరంగేట్రం చేస్తే చూడాలని దళపతి అభిమానులు కోరుకున్నారు. కానీ సంజయ్ మాత్రం తండ్రిలా హీరో కాకుండా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారారు.
సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లా జంటగా సిగ్మా అనే మూవీని తెరకెక్కించారు. పలుమార్లు వాయిదాపడిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సిగ్మా ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ప్రస్తుతానికి జేసన్ సంజయ్ తండ్రి విజయ్ ఫ్యాన్ బేస్ మాత్రమే ఈ సిగ్మా సినిమాను మోస్తోంది. దాంతో ఈ కుర్రాడు దర్శకుడిగా రెండో సినిమాను చేస్తాడా? లేక తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సిగ్మా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితం, రిలేషన్, బ్రేకప్‌ను తొలిసారిగా బయటపెట్టారు జేసన్ సంజయ్. ఈ వివరాల్లోకి వెళితే..

దళపతి విజయ్ కొడుకుగా జేసన్ సంజయ్‌కి పుట్టుకతోనే స్టార్‌డమ్ లభించింది. పలు వేదికలపై సంజయ్‌ని చూసిన అభిమానులు.. ఆయనను హీరోగా చూడాలని కలలు కన్నారు. అయితే చిన్నప్పటి నుంచే కథానాయకుడిగా కాకుండా ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న జేసన్ సంజయ్ ఆ దిశగానే అడుగులు వేశారు. టొరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమో.. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ హానర్స్‌ను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
తండ్రి పెద్ద సూపర్‌స్టార్ అయినా సంజయ్ పెద్దగా మీడియా ముందుకు రాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. ఇటీవల తన తల్లిదండ్రుల విడాకుల కేసు, కుటుంబంలో గొడవల నేపథ్యంలో సంజయ్ పేరు బాగా వినిపించింది. తండ్రికి దూరంగా తల్లితోనే కలిసి ఉంటున్నారు విజయ్.. తన చెల్లెలు దివ్య అంటే అతనికి ప్రాణం. ఈ సమయంలోనే విజయ్‌తో జేసన్‌కి విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంతో పాటు మిగిలిన ఏ కార్యక్రమంలోనూ సంజయ్ కనిపించలేదు. తన సిగ్మా మూవీ ఈవెంట్‌కు విజయ్ వస్తారని భావించిన సీఎం ఎక్కడా కనిపించలేదు.
ఇదిలాఉండగా.. సిగ్మా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ తాను ఒకరిని ప్రేమించానని, కానీ బ్రేకప్ జరిగిందని బయటపెట్టారు. కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఏడాదిన్నర పాటు ప్రేమించుకున్నాం. నేను ఉన్నత చదువుల కోసం ఫారిన్‌కు వెళ్లినప్పడు మా మధ్య దూరంగా పెరిగింది. ఇక రిలేషన్ కొనసాగించలేమని ఇద్దరం అంగీకారానికి వచ్చి ఆ బంధానికి ముగింపు చెప్పేశాం. బ్రేకప్ తాలూకా బాధ నుంచి బాధపడేందుకు ప్రేమ పాటలు ఎక్కువగా వినేవాడిని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ నా మనసును కంట్రోల్‌లో ఉంచుకున్నా. ఈ బ్రేకప్ తర్వాతే సిగ్మాను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాను.. ప్రస్తుతం అంతా సజావుగా సాగుతోందని జేసన్ సంజయ్ వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ బ్రేకప్ స్టోరీ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications
