"ఆ విషయంలో పాకిస్థాన్ ను చూస్తే భారత్ ఎందుకు భయపడుతోంది..?"

ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులకు హతమార్చింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య గతంలో కొన్ని సార్లు శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగినా అవి పూర్తిగా సమర్థవంతంగా కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా పాకిస్థాన్- భారత్ సంబంధాలపై కేంద్ర మాజీ మంత్రి, మాజీ డిప్లొమాట్ మణిశంకర్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ManiShankarAiyar Former diplomat Former Minister makes shocking comments India-Pakistan relations

భారత్ కు పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసేంత ధైర్యం ఉంది కానీ అదే దేశంతో కూర్చుని మాట్లాడే ధైర్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అట్టారీ- వాఘా బోర్డర్ వద్ద ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. టెక్నికల్ గా ఇరు దేశాల ప్రతినిధులు తమ దేశాల బోర్డర్ దాటకుండానే ఇలా భేటీ నిర్వహించొచ్చని పేర్కొన్నారు. హల్లా బోల్ కాన్ క్లేవ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మణిశంకర్ అయ్యర్ గతంలోనూ అనేకసార్లు ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఛాయ్ వాలా ప్రధానమంత్రి కారని మోదీపై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. అయితే పాకిస్థాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయ్యర్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అయ్యర్ కు ఇది అర్థం కావడం లేదని.. పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు భారత్ కు ధైర్యం లేక కాదని.. ఆ దేశం కంటిన్యూ గా టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

గతంలోనూ 2015 లో పాకిస్థానీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ.. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగ్గా సాగాలంటే ఏం చేయాలన్న యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ.. దేశంలో మోదీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది జరుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+