ఆ కేంద్రమంత్రి అవుట్- నో రెన్యూవల్: కేంద్ర కేబినెట్ భారీ ప్రక్షాళన

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి బీజేపీ కసరత్తు పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లల్లో మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ఇదివరకే ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కిందటి నెల 29న విడుదలైంది. అభ్యర్థులు తమ నామినేషన్లను మంగళవారం లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 16న ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కిస్తారు.

సభ్యుల పదవీ కాలం నవంబర్ 25తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న 10 స్థానాలతో పాటు, ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన దినేష్ శర్మ రాజీనామాతో ఏర్పడిన ఉపఎన్నిక స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున స్థానాలకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

hardeep-singh-puri-dropped-as-bjp-names-eight-candidates-for-the-rajya-sabha-elections-in-uttar-prad

ఉత్తరప్రదేశ్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేతలు అరుణ్ సింగ్, నీరజ్ శేఖర్, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది, గీతా శాక్యా ఉన్నారు. వీరితో పాటు సమాజ్ వాదీ పార్టీ తరఫున రామ్ గోపాల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రామ్‌జీ గౌతమ్ పదవీ కాలం ముగియనుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం.. అధికార బీజేపీ ఎనిమిది స్థానాలను మళ్లీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎనిమిది స్థానాల కోసం రాధాకాంత్ ఓఝా, ప్రకాష్ పల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్ నామినేట్ అయ్యారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని బీజేపీ డ్రాప్ చేసింది. ఆయన పేరు ఇందులో లేదు.

హర్దీప్ సింగ్ పూరికి రాజ్యసభ రెన్యూవల్ లభించకపోవడంతో ఆయన రాజీనామా తప్పట్లేదు. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇథనాల్ విషయంలో చోటు చేసుకున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఆయనకు రీనామినేట్ చేయట్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక, ప్రాంతీయ, కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన వారిని ఎంపిక చేసింది పార్టీ హైకమాండ్. ఎనిమిది మందిలో ముగ్గురు చొప్పున అగ్రవర్ణ అభ్యర్థులు, ఓబీసీకి చెందిన వారు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల నుంచి ఇద్దరిని తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు అవకాశం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+