భర్తకు చేరిన భార్య ,మాజీ ప్రియుడి ప్రైవేట్ ఫోటోలు.. కొంప కొల్లేరు.. షాకింగ్ ట్విస్ట్

విజయవాడలో ఒక యువతి కుటుంబ సభ్యులు మాజీ ప్రియుడిపై నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పీవీపీ మాల్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతడిని, అతనిపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పెళ్లికి ముందు ఒక యువకుడితో సన్నిహితంగా ఉండేది. ఆ సమయంలో తీసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు యువకుడి వద్ద ఉన్నాయి. యువతి పెళ్లి అయిన తర్వాత కూడా ఆ యువకుడు ఆమెను వేధిస్తూ, కలవాలని డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమె అంగీకరించకపోవడంతో ఆ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను ఆమె భర్తకు పంపేశాడు.

Ex-Girlfriend Family Attack on Man Near PVP Mall in Vijayawada After He Sent Private Photos to Her Husband

దీంతో భర్త ఆమెను వదిలేశాడు. కాపురం కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు పథకం ప్రకారం మాజీ ప్రియుడిని విజయవాడకు రప్పించారు. పీవీపీ మాల్ సమీపంలో అతడు ఉండగా అక్కడ అతడిని రౌండప్ చేసి దాడి చేశారు. నడిరోడ్డుపైనే ఈ ఘటన జరగడంతో స్థానికులు గందరగోళం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు.

ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో వేధించడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి కేసులు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో యువకుడిపై వేధింపులు, బ్లాక్‌మెయిల్ కింద కేసు నమోదు కావచ్చు. అదే సమయంలో కుటుంబ సభ్యులు చట్టం చేతిలోకి తీసుకోకుండా దాడికి పాల్పడడం కూడా నేరమేనని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగులకు ఇరుకు అద్దెగదుల్లో ఉండాల్సిన పనిలేదు... ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించనున్న రేవంత్ సర్కార్!
ఐటీ ఉద్యోగులకు ఇరుకు అద్దెగదుల్లో ఉండాల్సిన పనిలేదు... ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించనున్న రేవంత్ సర్కార్!

పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి గాయాలకు చికిత్స అందిస్తున్నారు. కేసు వివరాలు పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, స్వయంగా చర్యలు తీసుకోకూడదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+